కుల, మత భేదం లేకుండా మానవాళికి సేవ చేయాలి

 



జమియాత్-ఉల్-హుఫాజ్ అధ్యక్షుడు సదర్ ఖాజీ మన్ఖబత్ శాఖాన్ పిలుపు

 కరీంనగర్ ఫిబ్రవరి 3:-

కుల, మత బేధం లేకుండా ప్రతి ముస్లిం సమాజ సేవ చేయాలని జమియతుల్ హుఫ్ఫాజ్ కరీంనగర్ అధ్యక్షుడు ఖాజీ హాఫిజ్ మన్ఖబత్శాఖాన్ పిలుపునిచ్చారు.   గురువారం నాకా చౌరస్తాలో  జమియతుల్ హుఫాజ్ కార్యాలయంలో అధ్యక్షుడు సదర్ ఖాజీ హఫీజ్ అహ్మద్ మన్ఖబత్ షాఖాన్ అధ్యక్షతన నెలవారీ సమావేశం జరిగింది. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కష్టాల్లో ఉన్నవారికి.. మానవాళికి సేవ చేయడం ఇస్లాం ధర్మంలోని ముఖ్యమైన బోధనలలో భాగమని, పేదలకు సహాయం చేయడం, నిస్సహాయులకు సహాయం చేయడం, ఆపదలో ఉన్నవారి కష్టాలను దూరం చేయడం.. ఇదొక గొప్ప ఆరాధన అన్నారు.  మహానియ ప్రవక్త (స) జీవితాన్ని సమీక్షించడం ద్వారా మానవాళికి సేవ చేయడం.. ప్రజలకు ఉపశమనం కలిగించడం ఆయన జీవిత ప్రధాన కర్తవ్యమని తెలియజేస్తుందని, ఈ గొప్ప పనిలో మనం కూడా నిమగ్నమై ఉండాలని అన్నారు.. ప్రస్తుత పరిస్థితుల్లో సోదరులతో సత్సంబంధాలు మెరుగయ్యేందుకు ప్రయత్నించాలని, వారి నిస్వార్థ సేవలను చూసి ముగ్ధులవ్వాలని కోరారు. ఈకార్యక్రమంలో ఉపాధ్యక్షుడు హఫీజ్ జియఉల్లాహ్ ఖాన్, కార్యదర్శి వసిముద్దీన్, కోశాధికారి మౌజ్జమ్ హుస్సేన్ ఫైజీ, హాఫిజ్ ఫరీదుద్దీన్ అంజద్, హాఫిజ్ సాధఖ్ అలీ, హాఫిజ్ రిజ్వాన్, ముఫ్తి షాదబ్ తఖీ, గ్రామీణ ఇమామ్ లు పాల్గొన్నారు.