రోడ్డుకు ఇరువైపులా పెరిగిపోయిన జంగిల్ ను తొలగించిన జి .ఎస్ .ఆర్ చారిటబుల్ ట్రస్ట్...


విశాఖపట్నం ఫిబ్రవరి 14(జనంసాక్షి బ్యూరో):   గ్రేటర్ విశాఖ 85 వ వార్డు  ఏడుమెట్ల మర్రిపాలెం వెళ్లే మార్గంలో రోడ్డు ఇరువైపులా జంగిల్ పెరిగిపోవడంతో స్థానిక జి ఎస్ ఆర్ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో తుప్పలను తొలగించారు. ఈ తుప్పలు పెరిగిపోవడంతో ఈ మధ్యకాలంలో ఇక్కడ చాలా ప్రమాదాలు చోటు చేసుకోవడం జరిగింది . కొన్ని రోజుల క్రితం ఈ మలుపు వద్ద స్థానిక వ్యక్తి చనిపోవడం కూడా జరిగింది. వాహనదారులకు ప్రమాదంగా మారిన ఈ మలుపు వద్ద జంగిల్ పెరిగిపోవడంతో మార్గం కనిపించక ప్రజలు చాలా ఇబ్బందులు పడుతున్నారు. ఈ విషయం తెలుసుకున్న జి ఎస్ ఆర్ చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ గొన్న రమాదేవి పర్యవేక్షణలో సోమవారం జంగిల్ క్లియరెన్స్ చేయించడం జరిగింది . ఈ కార్యక్రమంలో చారిటబుల్ ట్రస్ట్ ప్రధాన కార్యదర్శి మడక రమేష్ నాయుడు ,వైస్ చైర్మన్ గొల్లవిల్లి హరీష్ కుమార్ ట్రెజరర్ హర్షవర్ధన్, ట్రస్ట్ సభ్యులు గొల్లవిల్లి నానాజీ పుప్పాల దిలీపకుమార్ లోకేష్ తదితరులు పాల్గొన్నారు.