కెసిఆర్‌ రాజ్యాంగ వ్యతిరేక వ్యాఖ్యలపై పోరు


క్షమాపణలుచెప్పే వరకు ఆగదన్నకాంగ్రెస్‌

నిజామాబాద్‌,ఫిబ్రవరి8(జనంసాక్షి): కెసిఆర్రాజ్యాంగ వ్యతిరేక ప్రకటనలపై తముద్యమాన్ని మరింత ఉధృతం చేస్తామని కాంగ్రెస్‌ జిల్లా అధ్యక్షుడు మానాల మోహన్‌రెడ్డి అన్నారు. కెసిఆర్‌ దీనిపై బహిరంగ క్షమాపణలు చెప్పాలన్నారు. మేధావులు కూడా దీనిని తీవ్రంగా ఖండిరచాలన్నారు. రాజ్యాంగ మార్చి సొంత రాజ్యాంగం రాసుకోవాలని కెసిఆర్‌ చూస్తున్నారని మండిపడ్డారు. కేంద్రంలో ఉన్న బీజేపీ, రాష్ట్రంలో ఉన్న టీ ఆర్‌ఎస్‌ ప్రభుత్వాలు రెండు రాజ్యాంగానికి వ్యతిరేకమేనని అన్నారు. కేసీఆర్‌ రాజ్యాంగాన్ని మార్చాలంటూ చేసిన వ్యాఖ్యలకు నిరసనగా కాంగ్రెస్చేస్తున్నపోరాటానికి ప్రజలు మదద్దతు ప్రకటించారని, ప్రధానంగగా దళితులు, ఆదివాసీల నుంచి మంచి స్పందన వస్తోందన్నారు. రాజ్యాంగాన్ని మార్చాలని
కేసీఆర్‌ చేసిన వ్యాఖ్యల వెనక బిజెపి కుట్రుందన్నారు. దేశ రాజ్యాంగం వల్లే తెలంగాణ స్వరాష్ట్ర ఆకాంక్ష నెరవేరిందనే విషయాన్ని కేసీఆర్‌ మరచిపోయి రాజ్యాంగ నిర్మాతలను అవమానపరిచేలా మాట్లాడడం సరికాదన్నారు. కేసీఆర్‌ రాజ్యాంగాన్ని మార్చాలని వ్యాఖ్యలు చేయడం దళిత నాయకుడు అంబేడ్కర్‌ను అవమానించడమే అని అన్నారు. రాజ్యాంగంలో పొందుపరిచిన ఆర్టికల్‌`3 ప్రకారం తెలంగాణ వచ్చింద న్నారు. కేసీఆర్‌ తన వ్యాఖ్యలను వెనక్కి తీసుకోవాలన్నారు. ప్రజలకు, రాజ్యాంగానికి క్షమాపణలు చెప్పాలని డిమాండ్‌ చేశారు. కేసీఆర్‌ రాజ్యాంగాన్ని మార్చాలని అనడం అవివేకమని దళిత ఐక్య సంఘటన సభ్యులు అన్నారు. రాజ్యాంగాన్ని మార్చాలని కేసీఆర్‌ వ్యాఖ్యలను ఖండిస్తున్నామని అన్నారు. అంబేద్కర్‌ను అవమానపరుస్తూ మాట్లాడిన మాటలను ఖండిస్తూ వెంటనే క్షమాపణ చెప్పాలని డిమాండ్‌ చేశారు.