వివేక కేసును ఇతర రాష్టాన్రికి బదిలీ చేయాలి: బోండా

అమరావతి,ఫిబ్రవరి23  (జనం సాక్షి):  వివేకా హత్య కేసు దర్యాప్తు చేస్తున్న సీబీఐ అధికారులను కాపాడుకోవాల్సిన బాధ్యత ఢల్లీి పెద్దలదే అని టీడీపీ నేత బోండా ఉమ అన్నారు. బుధవారం విూడియాతో మాట్లాడుతూ గతంలో జయలలిత కేసు విచారణ కర్ణాటకలో జరిగినట్లు వివేకా హత్య కేసు విచారణ వేరే రాష్ట్రంలో చేపట్టాలని డిమాండ్‌ చేశారు. నిందితులను కాపాడేందుకు వైసీపీ రాజ్యాంగ వ్యవస్థలను సైతం.. నాశనం చేసే తీరు చూసి దేశం మొత్తం నివ్వెరపోతోందన్నారు. బాబాయ్‌ హత్య కేసు వెలికితీస్తున్న సీబీఐ అధికారులపై పోలీసులతో కేసు పెట్టించి జగన్‌రెడ్డి చరిత్రకెక్కారని వ్యాఖ్యానించారు. తాడేపల్లి ఆదేశాలు సీబీఐ పాటించట్లేదని కక్షకట్టారని బోండా ఉమ విమర్శలు గుప్పించారు.