ఉప్పులూరు శ్రీీ బాలా రాజరాజేశ్వర స్వామి*..
బాల్కొండ కమ్మర్పల్లి. ఆర్. సి . మార్చు 01( జనం సాక్షి):
నేడు మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకుని నిజామాబాద్ జిల్లా కమ్మర్ పల్లి మండలంలో ఉప్పులూరు గ్రామం లో దక్షిణ కాశిగా ప్రసిద్ధి గాంచిన స్వయంభూగా వెలిసిన శ్రీ బాల రాజరాజేశ్వర స్వామి ఘనంగా పూజలు అందుకోనున్నారు. ఈ ఆలయం కాకతీయుల కాలంలో 12వ శతాబ్దంలో నిర్మింపబడిన పురాతన ఆలయం. ఈ పుణ్య క్షేత్రం పారనికంగా చరిత్రాత్మకంగా పవిత్రతను సంతరించుకుంది. ఈ పురాతన ఆలయం లో శ్రీ బాల రాజరాజేశ్వర స్వామి తో పాటు గణపతి నందీశ్వరుడు నాగేంద్రుడు కొలువుదీరి ఉన్నారు. ఈ ఆలయంలో శ్రీ బాల రాజరాజేశ్వర స్వామి స్వయంభూలింగేశ్వరుడిగా వెలసినటు చరిత్ర చెబుతుంది. దేవ గురు బృహస్పతి ఆదేశానుసారం ఉప్పులూరు లో వెలసిన స్వయంభులింగం శ్రీ బాల రాజా రాజేశ్వర స్వామిని ప్రతి దినం ఉదయం ఈశాన్య భాగాన గల కొలను బావిలో నుండి శుద్ధ జలం తో శ్రీ స్వామి వారిని పూజలు చేసిన శాప విమోచన కలుగును చెప్పెను ఇంద్రుడు అదే ప్రకారం శ్రీ స్వామి వారిని ఆర్జించిచేను బాల రాజేశ్వర స్వామి వారు ఇంద్రునకు స్వప్నంలో సాక్షాత్కరించి ఉప్పులూరు గ్రామానికి తూర్పుగా 75 ఆమడల దూరంలో గల శ్రీ వేములవాడ ఈ క్షేత్రంలో వెలిసిన రాజరాజేశ్వర స్వామి గుండం కోనేరులో స్నానం ఆచరించి వృధా భిషేకం రోజు జరిపిన శాపవిమోచనం జరుగునని చెప్పెను ఇంద్రుడు ఆ విధంగా పూజించి బ్రహ్మత్యా పాతకము పోగొట్టుకొని అందువలన క్షేత్రం వేములవాడ రాజరాజేశ్వర స్వామి ఉప్పులూరు నందు శ్రీ బాల రాజేశ్వర స్వామి అనే నామం వచ్చియున్నది....