నల్లవెల్లి గ్రామంలో లో ఘనంగా కాంగ్రెస్ జెండా పండుగ కార్యక్రమం


ఇబ్రహీంపట్నం, ఫిబ్రవరి 10 (జనంసాక్షి): యాచారం మండలం నల్లవెల్లిలో మండల పార్టీ అధ్యక్షులు మస్కు నర్సింహ, గ్రామ ఎంపీటీసీ, మండల ఎంపిటిసిల ఫోరం అధ్యక్షుడు ఈదులకంటి లక్ష్మీపతిగౌడ్ ఆధ్వర్యంలో  కాంగ్రెస్ పార్టీ జెండా పండుగను ఘనంగా నిర్వహించారు. కార్యక్రమంలో  మాజీ ఎమ్మెల్యే మల్రెడ్డి రంగారెడ్డి పాల్గొన్నారు. ఏ ఒక్కరికి కొత్తగా ఫించన్లు, కొత్త ఇండ్లు, ఏ ఒక్కరికి ఎకరా భూమి కూడా  ఇవ్వలేదని మండిపడ్డారు. మండలంలో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఇచ్చిన 8 వేల ఎకరాల భూమిని కాంగ్రెస్ పార్టీ దళితులకు బడుగు బలహీనవర్గాల వారికి ఇచ్చిందని అది గుంజుకొని 100 గజాలు, 200 గజాలు ఇవ్వలా అని అడుగుతున్నారని అన్నారు. తెలంగాణ ఇవ్వడమే కాంగ్రెస్ పార్టీ తప్పు అని మోడీ అన్నారని 8 ఏళ్లలో మోడీ దేశానికి కొత్తగా తెచ్చింది ఏమిలేదని అన్నారు. అంతకు ముందున్న కాంగ్రెస్ ప్రభుత్వాలు బడుగు బలహీన వర్గాల సంక్షేమం కోసం పని చేశాయని అన్నారు.  భారత రాజ్యాంగ నిర్మాత బాబా సాహెబ్ అంబేద్కర్ రాసిన రాజ్యాంగం పట్ల సీఎం కేసీఆర్ అనుచిత వ్యాఖ్యాలు చేశారని భారత సమాజం అంతా క్షమాపణ చెప్పాలని అడిగిందని అయినా ఇప్పటి వరకు క్షమాపణ చెప్పలేదన్నారు. ఇంటింటికి ఉద్యోగం ఇస్తానని ఒక్కరికన్న ఉద్యోగాలు ఇవ్వలేదని అన్నారు. రాజశేఖర్ రెడ్డి హయాంలో తాను పది లక్షల మందిగా ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు ఊరూరికి 10 ఎకరాలు పట్టాలు ఇప్పిచ్చి ఊరూరికి 100 ఇండ్లు కట్టిచ్చిన చరిత్ర కాంగ్రెస్ పార్టీది అన్నారు.  కార్యక్రమంలో మండల పార్టీ అధ్యక్షుడు మస్కు నరసింహ, సీనియర్ కాంగ్రెస్ నాయకులు ఈసి శేఖర్ గౌడ్, గులాం అక్బర్, అరవింద్ నాయక్,పాండు రంగారెడ్డి, దూస రమేష్, చిన్నోల్ల మల్లేశ్, మండల యూత్ కాంగ్రెస్ అద్యక్షుడు గౌరారం వెంకట్ రెడ్డి,జిల్లా నాయకులు ముచ్చర్ల సంపత్,మోటే శ్రీశైలం, నాయకులు నర్రె శ్రీశైలం, షాహిద్, ప్రశాంత్, తదితరులు పాల్గొన్నారు