పశ్చిమ ప్రాంతాల వైపు వెళ్లేందుకు ప్రత్యేక రైళ్ళు
ట్వీట్ చేసిన భారత ఎంబెసీ..ఆందోళన వద్దన్న కిషన్ రెడ్డి
పలువురు విద్యార్థులు ఇంకా చిక్కుకున్నారంటూ ట్వీట్లు
న్యూఢల్లీి, ( జనం సాక్షి): ఉక్రెయిన్ రాజధాని కీవ్ నగరంలో వీకెండ్ కర్ఫ్యూ ఎత్తివేసినట్లు
ఇండియన్ ఎంబసీ ట్వీట్ చేసింది. అంతే కాకుండా భారతీయ విద్యార్థులు పశ్చిమ ప్రాంతాల వైపు వెళ్లేందుకు ప్రత్యేక రైళ్లను నడిపిస్తున్నట్లు ట్వీట్‌లో పేర్కొన్నది. స్వదేశానికి వెళ్లాలనుకునే భారతీయ విద్యార్థులు.. ఈ ప్రత్యేక రైళ్లను ఉపయోగించుకుని పశ్చిమ ప్రాంతాలకు చేరుకోవాలని సూచించారు. హంగేరి, పోలాండ్, రోమానియా దేశాల నుంచి విద్యార్థులను ప్రత్యేక విమానాల్లో తరలిస్తున్నారు. ఇప్పటి వరకు ఆరు విమానాల్లో విద్యార్థులను తరలించారు. ఇంకా ఉక్రెయిన్‌లో 16 వేల మంది విద్యార్థులు ఉన్నట్లు తెలుస్తోంది.క్రెయిన్‌పై రష్యా దాడితో ఉక్కిరిబిక్కిరి అవుతున్న భారతీయ విద్యార్థులను తరలించే అంశంపై ప్రధాని నరేంద్ర మో చర్చించారు. అయితే ప్రస్తుతం ఉన్న సమాచారం మేరకు కొందరు కేంద్ర మంత్రులు ఉక్రెయిన్ సరిహద్దు దేశాలకు విజిట్ చేయనున్నట్లు తెలుస్తోంది. మంత్రులు హరిదీప్ సింగ్ పురి, జ్యోతిరాదిత్య సింథియా, కిరణ్ రిజిజు, వీకే సింగ్‌లు.. భారతీయ విద్యార్థులను తీసుకువచ్చేందుకు విదేశాలకు వెళ్లనున్నారు. ఉక్రెయిన్‌లో చదువుకుంటున్న తెలుగు విద్యార్థుల తల్లిదండ్రులు ఆందోళన చెందొద్దని కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి అన్నారు. సోమవారం ఆయన విూడియాతో మాట్లాడుతూ..భారతీయ విద్యార్థుల కోసం కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేసినట్లు తెలిపారు. విద్యార్థులను తీసుకొచ్చేందుకు అన్ని ఏర్పాట్లు చేస్తున్నామన్నారు. సరిహద్దు దేశాలకు కేంద్ర మంత్రులు వెళ్తున్నారని చెప్పారు. రష్యా, ఉక్రెయిన్‌తో కూడా సంప్రదింపులు జరుగుతున్నాయని కిషన్‌రెడ్డి చెప్పారు. మరోవైపు ఉక్రెయిన్‌పై రష్యా దాడులతో ఎప్పుడేం జరుగుతుందో తెలియని పరిస్ధితిలో అక్కడున్న భారత విద్యార్ధులు బిక్కుబిక్కుమని కాలం గడుపుతున్నారు. ఉక్రెయిన్ నుంచి తమను స్వస్ధలాలకు పంపాలని దేశ రాజధాని కీవ్‌లో చిక్కుకున్న విద్యార్ధిని భారత రాయబార కార్యాలయానికి పలుమార్లు ఫోన్ చేసినా స్పందించలేదని వాపోయారు. ఈ వీడియోను ట్విట్టర్‌లో షేర్ చేసిన బీజేపీ ఎంపీ వరుణ్ గాంధీ మోదీ సర్కార్‌పై విమర్శలతో విరుచుకుపడ్డారు. ఉక్రెయిన్‌లో చిక్కుకున్న తమ విద్యార్ధులను ఇతర దేశాలు సురక్షితంగా వారి స్వస్ధలాలకు తరలించగా భారత ప్రభుత్వం మాత్రం ఈ దిశగా చేసింది శూన్యమని మండిపడ్డారు. కేంద్ర ప్రభుత్వ నిర్వాకంతో 15,000 మందికి పైగా భారత విద్యార్ధులు ఉక్రెయిన్‌లో చిక్కుకుపోయారని వరుణ్ గాంధీ అన్నారు. ఇలాంటి సంక్షోభ సమయంలో భారత పౌరులకు సాయం చేయడం మోదీ ప్రభుత్వ కనీస బాధ్యతని ఆయన హితవు పలికారు. ఇక పశ్చిమ ఉక్రెయిన్‌కు వెళ్లాలని భారత రాయబార కార్యాలయం చేస్తున్న సూచనలను ఉక్రెయిన్‌లో చిక్కుకున్న బాధిత విద్యార్ధిని ప్రస్తావిస్తూ సరిహద్దులకు తాము 800 కిలోవిూటర్ల దూరంలో ఉన్నామని, అధికారుల సాయం లేకుండా అంతదూరం ప్రయాణించడం కష్టసాధ్యమని బాధిత విద్యార్ధిని పేర్కొన్నారు. తాము భారత రాయబార కార్యాలయ సిబ్బందికి ఫోన్లు చేసినా ఆయన తమ కాల్స్‌ను తిరస్కరిస్తున్నారని తన లాగే ఇక్కడ పలువురు భారత విద్యార్ధినీ, విద్యార్ధులు చిక్కుకుపోయారని ఆమె పేర్కొన్నారు. కీవ్‌లో ఉన్నవారంతా రైళ్లలో బయటపడాలని ఈ మద్యాహ్నం ఎంబసీ అధికారులు సూచించారని తమకు సరైన మార్గదర్శకాలు అందించాల్సిన అధికారులు తమను పూర్తిగా విస్మరిస్తున్నారని విద్యార్ధిని ఆవేదన వ్యక్తం చేశారు. సరిహద్దుల నుంచి భారత విద్యార్ధులను బయటకు తరలిస్తున్నామని రాయబార కార్యాలయ సిబ్బంది చెబుతున్నారని..అయితే తామున్న ప్రాంతం నుంచి సరిహద్దు 800 కిలోవిూటర్ల దూరంలో ఉందని..విద్యార్ధులుగా తాము సరిహద్దులకు ఎలా వెళ్లగలుగుతామని ప్రవ్నించారు. భారత ప్రభుత్వం తమకు ఎంతమాత్రం సహకరించడం లేదని ఆమె ఆరోపించారు.