మేకపాటి గౌతమ్‌కు సిఎం జగన్‌ నివాళి


కుటుంబ సభ్యులను ఓదార్చిన సిఎం

తన సహచరుడు కోల్పోవడంపై జగన్‌ ఆవేదన

జూబ్లీహిల్స్‌ నివాసంలో పలువురు నేతల నివాళి

హైదరాబాద్‌,ఫిబ్రవరి21(జ‌నంసాక్షి): ఎపి ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి మేకపాటి గౌతమ్‌ రెడ్డి మృతి పట్ల సిఎం జగన్‌ సంతాపం తెలిపారు.  జూబ్లీహిల్స్‌ రోడ్‌ నంబర్‌ 46లోని మంత్రి గౌతవ్‌ రెడ్డి ఇంటికి వెళ్లి ఆయన భౌతికగాయానికి జగన్‌ నివాళులర్పించి, పుష్పాంజలి ఘటించారు. అనంతరం మంత్రి కుటుంబ సభ్యులను పరామర్శించి ధైర్యం చెప్పారు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుడిని ప్రార్థించినట్లు పేర్కొన్నారు. ఇదిలావుంటే  ఉభయ తెలుగు రాష్టాల్రకు చెందిన పలువురు మంత్రులు, ఎంపిలు,రాజకీయ ప్రముఖులు వెళ్లి నివాళి అర్పించారు. చంద్రబాబుకూడా వెళ్లి నివాళి అర్పించారు. 

మంగళవారం ఉదయం ఎయిర్‌ అంబులెన్స్‌ లో గౌతమ్‌ రెడ్డి భౌతిక కాయాన్ని ఎపికి తరలించనున్నారు. నెల్లూరులో ప్రజల సందర్శనార్థం భౌతికకాయాన్ని ఉంచనున్నారు. బుధవారం ఉదయం నెల్లూరు నుంచి బ్రాహ్మణపల్లికి అంతిమయాత్ర నిర్వహించి మధ్యాహ్నం అంత్యక్రియలు నిర్వహించనున్నారు. గౌతమ్‌ రెడ్డి అంత్యక్రియల్లో సిఎం జగన్‌ పాల్గొననున్నట్లు తెలుస్తోంది.గౌతమ్‌రెడ్డి మరణం జీర్ణించుకోలేనిదని ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి అన్నారు. హైదరాబాద్‌, జూబ్లీహిల్స్‌లోని గౌతమ్‌ పార్థివదేహాన్ని సందర్శించి నివాళులర్పించారు. అనంతరం విూడియాతో మాట్లాడుతూ పరిశ్రమల శాఖ మంత్రిగా ప్రభుత్వానికి గౌరవం తెచ్చారన్నారు. అలాంటి వ్యక్తిని కోల్పోవడం పార్టీకి తీరని లోటన్నారు. గౌతమ్‌ ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుడిని ప్రార్థిస్తూ, ఆయన కుటుంబ సభ్యులకు సజ్జల తన ప్రగాఢ సానుభూతి తెలియచేశారు. మంగళవారం ఉదయం నెల్లూరుకు గౌతమ్‌రెడ్డి భౌతికకాయాన్ని తరలిస్తామని, బుధవారం స్వగ్రామంలో గౌతమ్‌రెడ్డి అంత్యక్రియలు జరుగుతాయని సజ్జల రామకృష్ణారెడ్డి తెలిపారు.  గౌతం రెడ్డి మరణం ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వానికి తీరని లోటని ఏపీ అధికార ప్రతినిధి శ్రీకాంత్‌ రెడ్డి అన్నారు. ప్రభుత్వానికి పెట్టుబడులు తీసుకురావాలని ఇటీవల దుబాయ్‌ వెళ్ళాడని, ఎప్పుడు హైదరాబాద్‌ వచ్చిన ఆప్యాయంగా రీసివ్‌ చేసుకునే వ్యక్తిన్నారు. ఈరోజు మన మధ్య లేకపోవడం దురదృష్టకరమన్నారు. బుధవారం రోజు నెల్లూరు తన సొంత గ్రామం బ్రాహ్మణపల్లి లో అంత్యక్రియలు జరుగుతాయని, ప్రత్యేక హెలికాప్టర్‌ కోసం ఆర్మీ అధికారులతో సంప్రదింపులు జరుపుతున్నామన్నారు. మంగళవారం నెల్లూరుకు గౌతంరెడ్డి పార్ధివదేహాన్ని తరలిస్తామని తెలిపారు. ప్రభుత్వ లాంఛనాలతో గౌతం రెడ్డి అంత్యక్రియలు జరుగుతాయన్నారు. మంత్రి గౌతమ్‌రెడ్డి గుండెపోటుతో మృతి చెందారు. ప్రస్తుతం గౌతమ్‌రెడ్డి పార్థివదేహం జూబ్లిహిల్స్‌లో ఆయన నివాసం ఉంచారు. అయితే గౌతమ్‌రెడ్డి అంత్యక్రియలు నెల్లూరు జిల్లా బ్రాహ్మణపల్లిలో నిర్వహించాలని కుటుంబసభ్యులు నిర్ణయం తీసుకున్నారు. దీంతో సోమవారం నెల్లూరుకి ఎయిర్‌ అంబులెన్స్‌లో గౌతమ్‌రెడ్డి భౌతికకాయం తీసుకెళ్తారు. రేపు నెల్లూరులో ప్రజల సందర్శనార్థం భౌతికకాయం ఉంచుతారు. బుధవారం ఉదయం నెల్లూరు నుంచి బ్రాహ్మణపల్లికి అంతిమయాత్ర జరుగుతుంది. అదే రోజు మధ్యాహ్నం బ్రాహ్మణపల్లిలో అంత్యక్రియలు నిర్వహిస్తారు. అంత్యక్రియల్లో సీఎం జగన్‌, మంత్రులు, వైసీపీ నేతలు పాల్గొననున్నారు.