కేంద్రం నుంచి నిధులు వస్తున్నా ఎపి దివాళా

ఆర్థిక స్థిరత్వం లేకుండా జగన్‌ పాలన: జివిఎల్‌

కాకినాడ,ఫిబ్రవరి21(జ‌నంసాక్షి): ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వానికి కేంద్రం నుంచి మూడు రెట్లు ఎక్కువగా నిధులు వస్తున్నా ఆర్థికంగా ఏపీ దివాళా ఎందుకు తీస్తుందని పార్లమెంట్‌ సభ్యుడు జీవీఎల్‌ నరసింహరావు ప్రశ్నించారు. తూర్పుగోదావరి జిల్లాలో సోమవారం  నిర్వహించిన బీజేపీ సమావేశంలో ఆయన మాట్లాడారు. కాకినాడలో పెట్రోకెమికల్‌ ప్రాజెక్టు అభివృద్ధికి ప్రభుత్వ సహకారం లేదని ఆయన అన్నారు. వైసీపీ, టీడీపీ ప్రభుత్వాలకు కవిూషన్లపై ఉన్న శ్రద్ధ ప్రాజెక్టులపై లేదని దుయ్యబట్టారు. ఆవాస్‌ యోజన పథకం కింద కేంద్రం మంజూరు చేసిన ఇళ్లను ప్రజలకు ఇవ్వలేదని ఆరోపించారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు మాట్లాడుతూ ఏపీ ప్రభుత్వం గ్రావిూణ ఉపాధి హావిూ వేతనాలు ఇవ్వడం ఆరోపించారు. ఇళ్ల నిర్మాణం రాష్ట్ర ప్రభుత్వం వేగంగా పూర్తి చేయడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. వైసీపీ ప్రభుత్వం రాష్ట్రంలో సహకార చక్కెర కర్మాగారాలు మూసివేస్తుందని అన్నారు. విశాఖలో రైల్వే జోన్‌ పూర్తి చేయిస్తామని ఆయన వెల్లడిరచారు.