దేశంలో మారుతున్న రాజకీయాలు

 

సంకీర్ణానికి అనుకూలంగా పరిస్థితులు
మోడీపై ప్రజలకు తొలగిన భ్రమలు
నిర్ణయాకశక్తిగా మారనున్న కెసిఆర్‌
ఎమ్మెల్సీ గుత్తా సుఖేందర్‌ రెడ్డి
హైదరాబాద్‌,ఫిబ్రవరి17(జనంసాక్షి): కేంద్రంలో ఫెడరల్‌ ఫ్రంట్‌ ఏర్పాటుకు రోజురోజుకూ అవకాశాలు పెరుగుతన్నాయి.మోడీ వైఫల్యాలే లక్ష్యంగగా వివిధ ప్రాంతీయపార్టీలు ఏకం అవుతున్నాయి. మోడీ నిర్ణయాలను ఇప్పుడు ఎవరు కూడా ప్రశ్నించే స్థితిలో లేరని గుర్తించే కెసిఆర్‌ గళమెత్తారు. ధరల పెరుగుదల, పెట్రో ధరల దాడి, జిఎస్టీ వాతల గురించి బిజెపి నేతలుకూడా చర్చించడంలేదు. ఈ క్రమంలో బిజెపికి వ్యతిరేకంగగా ప్రత్యామ్నాయం కేవలం కెసిఆర్‌తో సాధ్యమని టిఆర్‌ఎస్‌ ఎమ్మెల్సీ గుత్తా సుకేందర్‌ రెడ్డి అభిప్రాయపడ్డారు. ఈ విషయాన్ని ముందే గుర్తించి కేంద్రంలో మోడీకి ప్రత్యామ్నాయం కావాలని కోరుకున్న మొదటి నాయకుడు సిఎం కెసిఆర్‌ అని గుర్తు చేశారు. ఫెడరల్‌ ఫ్రంట్‌ ప్రతిపాదన తీసుకుని వచ్చిన మొదటి నేత కూడా కెసిఆర్‌ అన్నారు. నిజానికి ఆనాడు కెసిఆర్‌ ప్రతిపాదనపై ఓ అడుగు ముందుకు వేసివుంటే ఇవాళ ఈ పరిస్థితి వచ్చి ఉండేది కాదన్నారు. గతకొన్ని రోజులుగా జరుగుతున్న ప్రచార సరళి, జాతీయ రాజకీయాల్లో వస్తున్న మార్పులు చూస్తుంటే సిఎంకెసిఆర్‌ ప్రధాని అయినా ఆశ్చర్య పోవాల్సిన పనిలేదన్నారు. గురువారం నాడాయన ఆర్‌ఎన్‌ఎ ప్రతినిధితో మాట్లాడుతూ ..ఈ విషయంలో కెసిఆర్‌ తప్పకుండా ఆలోచన చేస్తారని అన్నారు. సంకీర్ణ రాజకీయాల్లో ఏదైనా సాధ్యం అన్నారు. ఐదు రాష్టాల్ర ఎన్నికల ఫలితాల తరవాత దేశంలోని ఇతరపార్టీలు కూడా మరింత వేగంగా నిర్ణయం తీసుకునే అవకాశాలు ఉన్నాయని అన్నారు. అయితే ప్రత్యామ్నాయ రాజకీయాలు కేవలం కెసిఆర్‌కు మాత్రమే సాధ్యమని గగుత్తా అన్నారు. ఢల్లీిలో నిర్ణాయక శక్తిగా అవతరించడానికి కెసిఆర్‌కు మాత్రమే అవకాశం ఉందన్నారు. కెసిఆర్‌తోనే దేశాభివృద్ధి సాధ్యమవుతుందని తెలిపారు. తెలంగాణ తరహా అభివృద్ధి చేయాలంటే అన్ని రాష్టాల్ల్రో విపక్షాలను అధిక మెజారిటీతో గెలిపించి ఫెడరల్‌ ఫ్రంట్‌ ద్వారా కేసీఆర్‌ను ప్రధాని చేయాలని అకాంక్షించారు. 70 సంవత్సరాలు దేశాన్ని పాలించిన నాయకులు దేశ అభివృద్ధిని పట్టించుకున్న దాఖలాలు లేవని విమర్శించారు. రాష్ట్ర ముఖ్యమంత్రిగా కేసీఆర్‌ ఏడేళ్లలో రైతుల పక్షాన నిలబడి నిరుపేద ప్రజలకు ఎన్నో సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టారన్నారు.పేదల కుటుంబా లకు అండగా నిలుస్తున్న మహోన్నతమైన వ్యక్తి కేసీఆర్‌ ప్రధానిగా ఉంటే రైతు రాజ్యంగా తయారు చేస్తారని అన్నారు. దేశవ్యాప్తంగా జరుగుతున్న ఎన్నికలు రాష్టాల్రకు చెందినవి కాదని, ఇది దేశాభివృద్ధి కొరకు జరిగే ఎన్నికలన్నారు. కెసిఆర్‌ జాతీయనేతగా ఎదిగితే సమస్యలను పరిష్కరిస్తూ దేశ ప్రగతిని మరింత పెంచవచ్చన్నారు. ప్రస్తుతం దేశ ప్రజలకు చౌకీదార్‌, టేకేదార్‌ అవసరం లేదని ప్రజలకు మెరుగైన పాలన అందించే నాయకులు, ధృడ సంకల్పంతో ఉన్న సైనికుడు కావాలన్నారు. దేశ ప్రధాని మోదీకి
ప్రజల సమస్యలపై ఎటువంటి అవగాహన లేదని విమర్శించారు. కాంగ్రెస్‌ ప్రజల సొమ్ముతో అవినీతి అక్రమాలకు పాల్పడుతూ వేలాది కోట్ల రూపాయాలు దోచుకున్నారని ఆరోపించారు. సీఎం కేసీఆర్‌కు దేశాన్ని పాలించే సత్తా ఉంది. ఇప్పటికే తెలంగాణలో జరుగుతున్న అభివృద్ధి, అమలవుతున్న సంక్షేమ పథకాలు.. వాటి ఫలితాలపై అంతర్జాతీయ స్థాయిలో చర్చించుకుంటున్నాయి. తెలంగాణ వనరులు, అవసరాలపై పూర్తి పట్టున్న ఉద్యమ నేత సీఎం కావడం, అనతి కాలంలోనే రాష్టాన్న్రి అగ్రభాగాన నిలపడం మామూలు విషయం కాదు. ఇలానే దేశావసరాలు, నదుల అనుంధానం, రైతులు, వ్యవసాయ రంగంపై స్పష్టమైన అవగాహన ఉంది. అలాంటి కేసీఆర్‌ ప్రధానమంత్రి అయితే దేశ ప్రజలు అన్ని విధాలా లబ్ధిపొందుతారని అన్నారు. దేశ ప్రజల ప్రయోజనాన్ని దృష్టిలో పెట్టుకుని ముఖ్యమంత్రి ఫెడరల్‌ ఫ్రంట్‌ ఆవశ్యకతను గతంలోనే ప్రస్తావించారని అన్నారు. అదే సమయంలో దేశంలోని అనేక ప్రాంతీయ
పార్టీల నేతలు కేసీఆర్‌ ముందుచూపును స్వాగతించి ఉంటే ఇప్పటికే ఓ రాజకీయాల్లో ఓ మలుపు తిరిగేవని అన్నారు. జాతీయ రాజకీయాల్లో కాంగ్రెస్‌, బిజెపిల కాలం చెల్లిందని అన్నారు. జాతీయ రాజకీయాల్లో ఇప్పుడు మోడీపై నమ్మకం పోయిందని, అలాగే కాంగ్రెస్‌ను మరోమారు ప్రజలు నమ్మే స్థితి లేదన్నారు. దీంతో జాతీయ స్థాయిలో ప్రాంతీయ పార్టీల కూటమికే అవకాశాలు ఉన్నాయన్నారు. వివిధ పార్టీల్లో సత్తా కలిగిన నేత ఎవర్న చర్చ వచ్చినప్పుడు అంతా తెలంగాణ వైపు చూస్తున్నారని అన్నారు. దీనికి కారణం కెసిఆర్‌ అమలు చేస్తున్న కార్యక్రమాలకు తోడు, తెలంగాణ సాధించిన విప్లవ నేతగా గుర్తింపు ఉందన్నారు. తాము వివిధ పార్టీల నాయకులతో మాట్లాడినప్పుడు ఇదే భావన వ్యక్తం అవుతోందన్నారు. దేశం పట్ల స్పష్టమైన అవగాహన కెసిఆర్‌కు ఉందన్నారు. ఉపాధిహావిూ పథకాన్ని వ్యవసాయరంగంతో అనుసంధానించాలని సీఎం కేసీఆర్‌ అనేకసార్లు కేంద్ర ప్రభుత్వం దృష్టికి తేవడం దానిపై గట్టిగా పోరాడడం వంటి జాతీయసమస్యలపై రాజకీయ పార్టీలు కెసిఆర్‌ వైఖరిని సమర్థిస్తున్నారని అన్నారు.