మేడారంను దర్శించుకున్న గద్దర్
తెలంగాణపై విమర్శలను తిప్పికొట్టాలని పిలుపుములుగు,ఫిబ్రవరి11(జనం సాక్షి): తెలంగాణ ఏర్పాటు అనేది ఒక త్యాగాల నినాదమని, త్యాగాల స్ఫూర్తితో ఏర్పడిన రాష్ట్రంపై ఎంతటి వారు విమర్శలు చేసినా చర్చించాల్సిన అవసరం ఉందని ప్రజా కవి గద్దర్ అన్నారు. తెలంగాణపై కుట్రలు చేసే ప్రయత్నాలను తిప్పికొట్టాలన్నారు. ములుగు జిల్లా తాడ్వాయి మండలం శ్రీ సమ్మక్క సారలమ్మలను గద్దర్ దర్శించుకున్నారు. తిరుగు ప్రయాణంలో ములుగు జిల్లా కేంద్రంలోని గాంధీ విగ్రహానికి పూలమాలలు నివాళులర్పించారు. అనంతరం విూడియాతో మాట్లాడుతూ తనదైన శైలిలో పాట రూపంలో సమ్మక్కకు మొక్కలు చెల్లించిన విధానాన్ని వివరించారు.
సమ్మక్క`సారలమ్మల పోరాట స్ఫూర్తితో, అనేకమంది త్యాగాలతో ఏర్పడిన తెలంగాణపై కుట్రలు చేసే ప్రయత్నాలను తిప్పికొట్టాలన్నారు. నీళ్లు, వనరులు, నిధులు సాధించుకుని తెలంగాణ అభివృద్ధికి పాటుపడాలని సూచించారు. ఇటీవల రాజ్యసభలో ప్రధాని మోదీ తెలంగాణ ఏర్పాటుపై చేసిన విమర్శలపై ప్రశ్నించగా మోదీ వ్యాఖ్యలపై చర్చించాల్సిందేనని వెల్లడిరచారు.