మేడారం జాతర సందర్భంగా రామప్ప దేవాలయం లో ఏర్పాట్లు.......


రామప్ప ను సందర్శించిన సుప్రీం కోర్టు రిజిష్టర్ జీ.వి.రత్తయ్య.....

విద్యుత్ కాంతులతో రామప్ప దేవాలయం.....

వెంకటాపూర్(రామప్ప)ఫిబ్రవరి15(జనం సాక్షి):-

ములుగు జిల్లా వెంకటాపూర్ మండలం పాలంపేట గ్రామం లోని రామప్ప ను సందర్శించిన సుప్రీం కోర్టు రిజిష్టర్ జీ.వి. రత్తయ్య,ఆయన వెంట హై కోర్టు రిజిస్టర్ సాంభశివరావు, ప్రభాకర్ తదితరులు పాల్గొన్నారు.

విద్యుత్ కాంతులతో రామప్ప దేవాలయం..

మేడారం జాతరను పురస్కరించుకొని భక్తులకు సౌకర్యం నిమిత్తం విద్యుత్ కాంతులతో రామప్ప దేవాలయం కాంతులతో ఆకట్టుకుంది. భక్తుల సౌకర్యం నిమిత్తం అన్ని రకాల ఏర్పాట్లను అధికారులు పూర్తిచేశారు.

సిబ్బందికి సూచనలు ఇస్తున్న ములుగు సిఐ శ్రీధర్...

రామప్ప పరిసరాలలో విధులు నిర్వహిస్తున్న సిబ్బంది కి సూచనలు చేసిన ములుగు సిఐ శ్రీధర్

రామప్పకు వచ్చే భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా ట్రాఫిక్ ఇబ్బందులు తలెత్తకుండా విధులు నిర్వహించాలని అన్నారు.అలాగే రామప్ప ఆలయం ముందున్న షాపులు నాలుగడుగులు వెనక్కి జరిగి వేసుకొని వచ్చే భక్తులకు ఇబ్బంది కలగకుండా చూసుకోవాలని చూడాలని అన్నారు.