` రాష్ట్ర ప్రజలకు మోదీ క్షమాపణల చెప్పాలి
` మంత్రి కేటీఆర్ డిమాండ్
` నేడు రాష్ట్ర్యవ్యాప్తంగా నిరసనలు నిర్వహించాలని టీఆర్‌ఎస్ శ్రేణులకు పిలుపు
హైదరాబాద్,ఫిబ్రవరి 8(జనంసాక్షి):ప్రధాని నరేంద్ర మోదీ తెలంగాణను మళ్లీ మళ్లీ అవమానిస్తున్నారని రాష్ట్ర ఐటీ, పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ అన్నారు. పార్లమెంట్ వేదికగా ప్రధాని చేసిన వ్యాఖ్యలను ఖండిస్తున్నానన్నారు. దశాబ్దాల పోరాటం, ప్రాణ త్యాగాలను మోదీ కించపరిచారన్నారు. వెంటనే ప్రధాని తెలంగాణ ప్రజలకు క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు.తెలంగాణ ఏర్పాటు విూద మరోసారి విషం చిమ్ముతూ పార్లమెంట్‌లో అడ్డగోలుగా మాట్లాడిన ప్రధాని నరేంద్ర మోదీ వ్యాఖ్యలపై బుధవారం నిరసన కార్యక్రమాలు చేపట్టాలని టీఆర్‌ఎస్ శ్రేణులకు మంత్రి, టీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పిలుపునిచ్చారు. తెలంగాణ వ్యాప్తంగా నియోజకవర్గ, మండల కేంద్రాల్లో కేంద్రాల్లో బీజేపీ దిష్టిబొమ్మల దహనం చేయడంతో పాటు నల్లజెండాలతో నిరసన ప్రదర్శనలు చేపట్టాలని శ్రేణులకు సూచించారు.