మోడీతో టిఆర్‌ఎస్‌ మిలాఖత్‌: రేవంత్‌

 

హైదరాబాద్‌,ఫిబ్రవరి11 (జనం సాక్షి);  ఏపీలో పార్టీ చచ్చిపోతున్నా కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షురాలు సోనియా గాంధీ తెలంగాణ ఇచ్చారని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి పేర్కొన్నారు. చరిత్రలో నిలిచిపోయే నిర్ణయాలు సోనియా తీసుకున్నారన్నారు. బీజేపీ, టీఆర్‌ఎస్‌ మధ్య చీకటి ఒప్పందం ఉందన్నారు. పార్లమెంట్‌లో ప్రధాని వ్యాఖ్యలకు మద్దతుగా టీఆర్‌ఎస్‌ ఎంపీలు నిలిచారన్నారు. ఉలిక్కిపడి ఇప్పుడు టీఆర్‌ఎస్‌ ఎంపీలు నిరసనలకు దిగారని రేవంత్‌రెడ్డి ఎద్దేవా చేశారు.