మణికొండ భూములు సర్కారువే. ` సుప్రీంహైదరాబాద్‌,ఫిబ్రవరి 7(జనంసాక్షి):మణికొండల భూముల విషయంలో రాష్ట్ర ప్రభుత్వానికి ఊరట లభించింది. ఈ ప్రాంతంలోని 1654.32 ఎకరాల భూమి రాష్ట్ర ప్రభుత్వానికే చెందుతుందని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. గతంలో హైకోర్టు ఇచ్చిన తీర్పును పక్కన పెట్టి సుప్రీం తాజాగా రాష్ట్ర ప్రభుత్వానికి అనుకూలంగా తీర్పు ఇచ్చింది. 2012 ఏప్రిల్‌ 3న వక్ఫ్‌ బోర్డుకు అనుకూలంగా హైకోర్టు ఇచ్చిన తీర్పును సుప్రీంకోర్టు ధర్మాసనం కొట్టివేసింది. ఈ మేరకు 156 పేజీల తీర్పును జస్టిస్‌ హేమంత్‌ గుప్తా బెంచ్‌ వెలువరించింది. ఇనామ్‌ భూముల చెల్లింపులు పెండిరగ్‌ ఉంటే 6 నెలల్లో చెల్లించాలని ఆదేశించింది. భూముల స్వాధీనం విషయంలో వక్ఫ్‌బోర్డు ఇష్టారీతిలో వ్యవహరించడం కుదరదని స్పష్టం చేసింది. వక్ఫ్‌ భూములని భావిస్తే ఆధారాలతో నోటీసులు ఇవ్వాలని, సర్వే నివేదికను ప్రభుత్వానికి ఇవ్వాలని సర్వోన్నత న్యాయస్థానం ఆదేశించింది.భూములు వక్ఫ్‌బోర్డువని తేలితే రూ.50వేల కోట్లు కడతామని ప్రభుత్వం తరఫున న్యాయవాది కోర్టుకు తెలిపారు.