మూడు విమానాల్లో బయలుదేరిన విద్యార్థులు
న్యూఢల్లీి,ఫిబ్రవరి26(జనం సాక్షి ): రష్యా యుద్ధం కారణంగా ఉక్రెయిన్‌లో చిక్కుకున్న భారతీయ విద్యార్థులను రప్పించే కార్యక్రమం మొదలయ్యింది. ఉన్నత చదువుల కోసం అక్కడికి వెళ్లిన తెలుగు విద్యార్థులు క్షణ క్షణం గండంలా బ్రతుకుతున్నారు.. ఎప్పుడు ఏమి జరుగుతుందే ఎక్కడ ఏ బాంబ్ పేలుతుందోనని ప్రాణాలు అరిచేతుల్లో పెట్టుకుని ఉన్నారు. ఈ నేపథ్యంలో తెలుగు రాష్టాల్ర వినతితో కేంద్రం కూడా వారిని రప్పించేందుకు తగిన చర్యలు తీసుకున్నది. ఈ క్రమంలోనే అక్కడ చిక్కుకున్న విద్యార్థులతో పాటు ఇతరులను భారత్‌కు తీసుకువచ్చేందుకు మూడు విమానాలను కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేసింది. విద్యార్థులను దేశానికి తిరిగి తీసుకువచ్చే ఖర్చులు తామే భరిస్తామని వెల్లడిరచిన విషయం విదితమే. ఉక్రెయిన్ నుంచి ఎయిరిండియా తొలి విమానం 219 మంది భారతీయులను ముంబై తీసుకువచ్చేందుకు బయలుదేరిందని విదేశాంగ శాఖ మంత్రి జైశంకర్ తెలిపారు. కాగా, ఉక్రెయిన్ నుంచి తరలిస్తున్న 470 మంది భారతీయ విద్యార్థుల్లో తెలుగు రాష్టాల్రకు చెందిన 22 మంది విద్యార్థులు ఉన్నారు. అలాగే కేరళ నుంచి 17, తమిళనాడు నుంచి నలుగురు విద్యార్థులు ఉన్నట్లు అధికారులు తెలిపారు.
ఉక్రెయిన్ నుంచి విద్యార్థుల తరలింపు