పాల్గొని నివాళి అర్పించిన మంత్రులు
హైదరాబాద్,ఫిబ్రవరి15(జనం సాక్షి): శ్రీ శ్రీ శ్రీ సద్గురు సంత్ సేవాలాల్ మహారాజ్ 283వ జయంతి ఉత్సవాలు తెలంగాణ భవన్‌లో ఘనంగా జరిగాయి. ఈ వేడుకలను మంత్రులు శ్రీమతి సత్యవతి రాథోడ్, తలసాని శ్రీనివాస్ యాదవ్, మహమూద్ అలీ ఆధ్వర్యంలో నిర్వహించారు. బంజారా మహిళలు సంప్రదాయ వేషధారణలో ఆటలు ఆడారు. భోగ్ బండార్ కార్యక్రమాన్ని భక్తి శ్రద్ధలతో నిర్వహించారు.ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంలో రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా నిర్వహించే ఈ కార్యక్రమానికి మంత్రులతో పాటు ఎమ్మెల్సీ వాణీ దేవి, మాజీ ఎంపి సీతారామ్ నాయక్, మాజీ ఎమ్మెల్సీ శ్రీనివాస రెడ్డి, టి.ఆర్.ఎస్ నేతలు రూప్ సింగ్, రాంబాబు నాయక్, శ్రీరామ్ నాయక్, సుందర్ నాయక్, అనితా నాయక్, కరాటే రాజు, గోవింద్ నాయక్, ఎస్సీ, ఎస్టీ కమిషన్ మాజీ సభ్యులు రాంబల్ నాయక్, ఇతర గిరిజన నేతలు, పూజారులు పాల్గొన్నారు.