ఆందోళనలో పాడి రైతులు
నెల్లూరు,ఫిబ్రవరి21 : పశువుల బీమా పధకాల అమలు ఆటకెక్కాయి. ఈ ఏడాది పథకాలు అమలు చేయకపోవడంతో పాడి రైతులకు ధీమా కరువైంది. పశువులు మృత్యువాతపాలైతే ఆర్థిక భరోసా ఉండదని అందోళన నెలకొంది. రోడ్డు ప్రమాదాలు, విద్యుతాఘాతం, పకృతి వైపరీత్యాలు సంభవించి మృత్యువాత పడి పాడిరైతు తీవ్రంగా నష్టపోతున్నారు. వేలాది రూపాయలు ఖర్చు చేసి రైతులు ఆవులు, గేదెలు కోనుగోలు చేస్తున్నారు. అనారోగ్యానికి గురై మృతి చెందితే బీమా అందకపోవడంతో లబోదిబోమంటున్నారు. క్షీరసాగరం, క్యాటిల్‌బీమా పథకాలు నాలుగున్నరేళ్ళుగా నిలిచిపోవడంతో పాడిరైతులు ఆందోళన చెందుతున్నారు. క్యాటిల్ బీమాలో ఒక్కో రైతుకు రెండు గేదెలకు బీమా వర్తించేది. ప్రమాదవశాత్తు మరణిస్తే రూ.10 నుంచి 50 వేల వరకు పరిహారం అందేది. క్షీరసాగర పథకం కింద ఆరు,ఏడు నెలలు ఉన్న చూడి ఆవులు, గేదెలకు కూడా ఈ బీమా వర్తించేది. కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బేడ్‌పాలక్ బీమా పథకం నీరుగాతుంది. ఈ బీమా ద్వారా గొర్రెల పెంపకందారులకు బీమా వర్తించేది. గొర్రెలు , మేకలు పెంచేకునే వారికి ఈ పథకం అసరాగా నిలిచేది. అధికారుల నిర్లక్ష్యవైఖరితో ఈ పథకం అమలు కావడం లేదు. ఈ పథకం ద్యారా వర్షాకాలంలో అనారోగ్యంతో గొర్రెలు, మేకలు మృత్యువాత పడితే ఈ పథకం ద్వారా భరోసా లభించేది.