రాధేశ్యామ్‌కు రాజమౌళి వాయిస్‌


 ( జనం సాక్షి):  
ప్రభాస్‌, పూజాహెగ్డే జంటగా నటిస్తున్న చిత్రం’రాధేశ్యామ్‌’. కె.కె.రాధాకృష్ణకుమార్‌ దర్శకుడు. పాన్‌ఇండియా స్థాయిలో తెరకెక్కిన ఈ సినిమా మార్చి 11న ఐదు భాషల్లో ప్రేక్షకుల ముందుకురానుంది. విడుదల తేదీ దగ్గరపడుతుండటంతో చిత్రబృందం ప్రచార కార్యక్రమాల్ని ముమ్మరం చేసింది. ఈ సినిమా తెలుగు వెర్షన్‌కు అగ్ర దర్శకుడు రాజమౌళి వాయిస్‌ ఓవర్‌ అందించబోతున్నారు. కథా గమనాన్ని, కీలకమైన ఘట్టాల్ని వివరిస్తూ సాగే ఆయన నేపథ్యగళం సినిమాకు ప్రధానాకర్షణ అవుతుందని చిత్రబృందం ఆనందం వ్యక్తం చేసింది. కాగా ఈ సినిమా హిందీ వెర్షన్‌కు బిగ్‌బి అమితాబ్‌బచ్చన్‌ వాయిస్‌ ఓవర్‌ అందిస్తున్న విషయం తెలిసిందే. ఇక కన్నడ వెర్షన్‌కు శివరాజ్‌కుమార్‌, మలయాళ వెర్షన్‌కు పృథ్వీరాజ్‌ సుకుమారన్‌ నేపథ్య గళాన్ని అందిస్తున్నారు. కృష్ణంరాజు, భాగ్యశ్రీ, సచిన్‌ఖేడ్‌కర్‌, ప్రియదర్శి తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి సినిమాటోగ్రఫీ: మనోజ్‌పరమహంస, సంగీతం: జస్టిన్‌ ప్రభాకరన్‌, సమర్పణ: గోపీకృష్ణమూవీస్‌, నిర్మాణం: యూవీ క్రియేషన్స్‌, కథ, స్క్రీన్‌ప్లే, దర్శకుడు: కె.కె.రాధాకృష్ణకుమార్‌.