ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఎస్టీ కమిషనర్ మెంబర్ ప్రమాణ స్వీకారం.


   విశాఖపట్నం.ఫిబ్రవరి21(.జనంసాక్షి బ్యూరో)నూతనంగా నియమితులైన ఆంధ్రప్రదేశ్ (ఎస్ టి) కమిషన్ మెంబర్ గా బాధ్యతలు చేపట్టిన  మత్యరాస విశ్వేశ్వర రాజు సోమవారం నాడు విజయవాడ లో ఎస్టీ కమిషన్ కార్యాలయంలో ఎస్టీ కమిషన్ చైర్మన్ డా"శ్రీ కుంభ రవిబాబు  అధ్వర్యంలో ప్రమాణ స్వీకారం చేసి బాధ్యతలు చేపట్టారు. ఈ కార్యక్రమంలో ట్రైకర్ ఎం డి. మరియు ఎస్టీ కమిషన్ కార్యదర్శి శ్రీ రవీంద్ర బాబు,ఎం ఎల్ సి. అనంత బాబు పాల్గోన్నారు. ఈ సందర్భంగా విశ్వేశ్వర రాజు  మాట్లాడుతూ సీఎం జగన్మోహన్ రెడ్డికి మరియు వైసీపీ పార్టీ నాయకులకు ధన్యవాదాలు తెలుపుతూ. రాష్ట్ర ముఖ్యమంత్రి మంత్రివర్యులు. ఎలాంటి పదవి ఇచ్చిన పార్టీ నిబద్దతతో పనిచేసి గిరిజనులకు మెరుగైన సేవలు చేయడానికి ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటానని అన్నారు.