పారిశుద్ధ కార్మికులకు కు సమాన వేతనాలు

 


బహుజన కార్మిక సంఘం డిమాండ్
 
కడెం ఫిబ్రవరి21( జనం సాక్షి) స్థానిక కడెం గ్రామపంచాయతీ లో పారిశుద్ధ కార్మికులు గా పనిచేస్తున్న వారితో బహుజన కార్మిక సంఘం రాష్ట్ర నాయకులు బుక్య రమేష్ సమావేశం నిర్వహించి వారి వేతనాలు తదితర సమస్యల గురించి అడిగి తెలుసుకోవడం జరిగింది అనంతరం బహుజన కార్మిక సంఘం రాష్ట్ర నాయకులు భూక్య రమేష్ మాట్లాడుతూ రాష్ట్రంలో కెసిఆర్ ప్రభుత్వం ,కేంద్రంలో బిజెపి ప్రభుత్వం వచ్చిన తర్వాత పారిశుద్ధ కార్మికుల శ్రమను దోచుకుంటున్నారు తప్ప వారి వేతనాలు మాత్రం పెంచడం లేదు సమాన పనికి సమాన వేతనం ఇవ్వాల్సిన ప్రభుత్వాలు ఇస్తున్న వేతనాల్లో కోతలు తీసుకున్న పరిస్థితి నెలకొంది ప్రభుత్వాలు ఇస్తున్న 8500 వేతనాల్లో అధికంగా మరో నలుగురిని పారిశుద్ధ్య కార్మికులను పెంచుకొని ఈ వేతన లోని కోత విధిస్తున్నారు పంచాయితీలో పని చేస్తున్నా పారిశుద్ధ్య కార్మికులకు ఎంత మంది ఉంటే అంతమందికి సమాన పనికి సమాన వేతనం ఇచ్చి వారికి న్యాయం చెయ్యాలని ,ప్రమాద బీమా 10 లక్షల రూపాయలు ఇవ్వాలని డబల్ బెడ్ రూమ్ ఇండ్లు మంజూరు చేయాలని పారిశుద్ధ కార్మికులను పర్మినెంట్ చేయాలి లేనిపక్షంలో రాబోయే ఎన్నికల్లో ఈ ప్రభుత్వాలకు తగిన గుణపాఠం నేర్పుతానని బి కే ఎస్ రాష్ట్ర నాయకులు ఒక పత్రిక ప్రకటనలో ప్రభుత్వాలను డిమాండ్ చేశారు ఈ కార్యక్రమంలో పారిశుద్ధ కార్మికులు మల్లీశ్వరి, నర్సవ్వ, గంగవ్వ ,మసీదు గంగయ్య ,గంగాధర్ ,గోండు లచ్చన్న, నల్ల నరసయ్య తదితరులు పాల్గొన్నారు