యాచారం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో కాంప్లెక్స్ సమావేశం


ఇబ్రహీంపట్నం,ఫిబ్రవరి 23 (జనంసాక్షి): యాచారం జడ్పి హైస్కూలు నందు స్కూల్ కాంప్లెక్స్ సమావేశం బుధవారం  ఆ పాఠశాల ప్రదానోపాధ్యాయులు రాజేందర్ గౌడ్ ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ మేరకు రాజేందర్ గౌడ్, చింతపట్ల పాఠశాల ప్రదానోపాధ్యాయులు సురేష్ మాట్లాడుతూ.. ప్రతి పాఠశాల తరగతికి సంబంధించిన విద్యార్థుల హాజరు అన్ని పరీక్షల ఫలితాలు వెనుకబడిన విద్యార్థుల అభివృద్ధికి ప్రత్యేకంగా చర్చించడం జరిగిందని అన్నారు. తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన 100 రోజుల  చదువు ఆనందించు కార్యక్రమంలో భాగంగా ఆర్పిలు, సలువాల నర్సింహ, శివ కుమార్ రెడ్డి పాఠశాలల  వారిగా విద్యార్థుల ప్రగతి ఫలితాలపై చర్చించడం జరిగింది. ఎంపీపీఎస్ చౌదర్పల్లి అర్చన ఆధ్వర్యంలో తెలుగు పాఠ్య బోధన, మధ్యాహ్నం పుస్తక సమీక్ష ఉపాధ్యాయుని వృత్తిపర అభివృద్ధి మరియు అంశాలతోపాటు  ఆంగ్లం, గణితం పాఠ్య బోధన చేశారు. అలాగే సి గ్రేడు విద్యార్థుల కోసమై ఉపాధ్యాయులు గ్రూపుల వారిగా టిఎల్ఎంను రూపొందించారు. వివిధ పాఠశాలల నుంచి వారి యొక్క పాఠశాల ప్రత్యేకతను అందరితో చర్చించారు.  తదుపరి సమావేశం మార్చిలో ఉంటుందని ఆర్పీలు నర్సింహ, శివకుమార్ రెడ్డి పేర్కొన్నారు. కార్యక్రమంలో సీఆర్పీ రమేష్,  వివిధ పాఠశాలల నుంచి 50 మంది ఉపాధ్యాయులు పాల్గొన్నారు.  వందేమాతరంతో కార్యక్రమం ముగించారు.