ప్రధాని వ్యాఖ్యలపై నేతల మండిపాటు

కరోనాకష్టాల్లో ప్రజలను ఆదుకోవడం తప్పా

మండిపడ్డ కేజ్రీవాల్‌,శివసేన
న్యూఢల్లీి,ఫిబ్రవరి8( జనంసాక్షి): కరోనా నేపథ్యంలో 2020లో తొలిసారి లాక్‌డౌన్‌ విధించిన సమయంలో.. ఆ వైరస్‌ వ్యాప్తికి కాంగ్రెస్‌ కారణమయ్యిందంటూ ప్రధాని మోదీ సోమవారం లోక్‌సభలో చేసిన ఆరోపణలపై విమర్శలు వెల్లువెత్తాయి. ఢల్లీిలో ఆమ్‌ ఆద్మీ సర్కార్‌తో పాటు మహారాష్ట్రలో శివసేన కూడా వలస కార్మికులను స్వంత ఇండ్లకు పంపించే ఏర్పాట్లు చేసిందన్నారు. అయితే ఆ ఆరోపణలను ఢల్లీి సీఎం కేజీవ్రాల్‌ కొట్టిపారేశారు. వలస కార్మికుల తరలింపుపై ప్రధాని మోదీ అన్ని అబద్దాలు చెబుతున్నట్లు కేజీ ఆరోపించారు. లోక్‌సభలో ప్రధాని మోదీ చేసిన ప్రకటన అబద్ధమని, ప్రజల జీవితాలతో రాజకీయాలు చేయడం సరికాదు అని ఆయన అన్నారు. కరోనా సమయంలో ఇబ్బందులుపడ్డ వారి పట్ల ప్రధాని మోదీ సున్నితంగా వ్యవహరించాలని దేశం ఆకాంక్షిస్తోందని ఆమ్‌ ఆద్మీ చీఫ్‌ అన్నారు. హిందీలో ట్వీట్‌ చేసిన కేజీవ్రాల్‌.. ప్రధాని వ్యాఖ్యలను ఖండిరచారు. ఫస్ట్‌ వేవ్‌ సమయంలో ముంబైలో కాంగ్రెస్‌ నేతలు వలస కూలీలకు టికెట్లు ఇచ్చి సొంతూళ్లకు వెళ్లగొట్టారని, దీంతో కరోనా వ్యాప్తి జరిగినట్లు మోదీ ఆరోపించారు.ఢల్లీిలో కూడా ప్రజలు ఊళ్లకు వెళ్లేందుకు బస్సులను స్థానిక ప్రభుత్వం ఏర్పాటు చేసినట్లు ప్రధాని చెప్పారు. ప్రధాని వ్యాఖ్యలు దురదృష్టకరమని మహారాష్ట్ర రెవన్యూ మంత్రి బాలాసాహబ్‌ థోరట్‌ ఆరోపించారు.