ఎంజిఎంలో పిడియాట్రిక్‌ యూనిట్‌ : ప్రారంభించినమంత్రి హరీష్‌ రావు

వరంగల్‌,ఫిబ్రవరి10(జనంసాక్షి): వరంగల్‌లో వైద్య సేవల ప్రక్షాళనకు త్వరలోనే శ్రీకారం చుడతానని ఎంజీఎంలో మంత్రులు హరీష్‌ రావు, ఎర్రబెల్లి రాథోడ్‌ పేర్కొన్నారు. నేడు వరంగల్‌ ఎంజీఎంలో విూడియాతో హరీష్‌రావు మాట్లాడుతూ.. రెండు రోజులు ఇక్కడే ఉండి పరిస్థితులను పర్యవేక్షిస్తానన్నారు. మేడారం వచ్చే భక్తులకు వైద్య సేవలు అందుబాటులో ఉంచుతామన్నారు. ప్రభుత్వ రంగంలో డయాగ్నోస్టిక్‌ సేవలు అందుబాటులోకి తెస్తున్నామన్నారు. వరంగల్‌ ఎంజీఎం ఆస్పత్రిలోని పిల్లల విభాగంలో రూ. 42 లక్షలతో ఏర్పాటు చేసిన పీడియాట్రిక్‌ యూనిట్‌ను రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి హరీష్‌ రావు ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో మంత్రులు ఎర్రబెల్లి దయాకర్‌ రావు, సత్యవతి రాథోడ్‌, ప్రభుత్వ చీఫ్‌ విప్‌ వినయ భాస్కర్‌, ఎంపీ దయాకర్‌, ఎమ్మెల్యేలు నరేందర్‌, ఆరూరి రమేష్‌, ఎమ్మెల్సీ బండ ప్రకాష్‌, బస్వరాజు సారయ్యతో పాటు పలువురు ప్రజా ప్రతినిధులు, అధికారులు తదితరులు పాల్గొన్నారు.