త్వరగా మిషన్‌ భగీరథ పూర్తి

జగిత్యాల,ఫిబ్రవరి8  (జనం సాక్షి) : ప్రతి ఇంటికీ నీరివ్వాలన్నదే ప్రభుత్వ లక్ష్యమనీ, ఆ దిశగా అధికారులు, కాంట్రాక్టర్లు పనిచేయాలని ఎమ్మెల్యే డాక్టర్‌ సంజయ్‌ ఆదేశించారు. మిషన్‌ భగీరథ నీరు గ్రామాల్లో ప్రతి ఇంటింటికి వచ్చేలా ఇవ్వాలనేదే ప్రభుత్వ లక్ష్యమని, అందుకు అనుగుణంగా పనిచేసి నల్లాలు పెట్టి కనెక్షన్‌ ఇవ్వాలన్నారు. అలాగే చేయని వారిపై చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. మిషన్‌ భగీరథ నియమ నిబంధనల ప్రకారం ప్రభుత్వ ఉత్తర్వుల్లో పేర్కొన్న విధంగా గ్రామాల్లో నీరు అందించాలని సంబంధిత అధికారులను, కాంట్రాక్టర్లకు సూచించారు. పైపులు వేసినప్పుడు తవ్విన గుంతలు పూడ్చాలనీ, సీసీ రోడ్డులు తవ్విన దగ్గర సీసీ రోడ్డును సరిచేయాలన్నారు. పైపులు అసంపూర్తిగా చేయకూడదనీ, పాత, కొత్త ట్యాంకులు పూర్తి చేసి అన్ని ట్యాంకులకు నీటి కనెక్షన్‌ ఇవ్వాలన్నారు.