మేడారం జాతరకు రండి : సిఎం కెసిఆర్‌కు ఆహ్వాన పత్రిక అందచేత


హైదరాబాద్‌,ఫిబ్రవరి8((జనం సాక్షి)): మేడారం సమ్మక్క సారలమ్మ జాతర ఫిబ్రవరి 16 నుంచి ప్రారంభమౌతున్న సందర్భంగా..జాతరకు రావాల్సిందిగా ముఖ్యమంత్రి కెసిఆర్‌కు ఆహ్వాన పత్రం అందచేశారు. మంగళవారం ప్రగతి భవన్‌లో పంచాయితీరాజ్‌, గ్రావిూణాభివృద్ధి, శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌ రావు, గిరిజన,మహిళాశిశు సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాథోడ్‌, దేవదాయ శాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్‌ రెడ్డి, ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్‌ రెడ్డి,ఎమ్మెల్యే ఆత్రం సక్కు తదితరులు కలిసి ఆహ్వాన పత్రికను అందజేశారు. ముఖ్యమంత్రిని కలిసిన వారిలో ట్రైబల్‌ వెల్ఫేర్‌ కమిషనర్‌ క్రిస్టినా, ఎండోమెంట్స్‌ కమిషనర్‌ అనిల్‌ కుమార్‌, మేడారం దేవాలయ ఈవో రాజేందర్‌, జాతర ధర్మకర్తల మండలి చైర్మన్‌ కొర్నిబెల్లి శివయ్య, పూజారుల సంఘం అధ్యక్షుడు సిద్దబోయిన జగ్గారావు, బడే నాగజ్యోతి, దుర్గం
రమణయ్య తదితరులు ఉన్నారు.