జంగాలపల్లి బ్రాహ్మణి హై స్కూల్ పక్కన ఉన్న వైన్ షాప్ ను వెంటనే తొలగించాలి


అడిషనల్  కలెక్టర్ నగేష్ కి వినతి పత్రం ఇచ్చిన ఎస్ఎఫ్ఐ,ఏబిఎస్ఎఫ్

ములుగు,ఫిబ్రవరి11(జనం సాక్షి):- 

ములుగు మండలం జంగాలపల్లి గ్రామంలో గల బ్రాహ్మణ హై స్కూల్ పక్కన ఉన్న వైన్ షాప్ ను తొలగించాలని ములుగు జిల్లా అడిషనల్ కలెక్టర్ నగేష్ కి వినతి పత్రం ఇవ్వడం జరిగింది.అనంతరం విద్యార్థి సంఘాల నాయకులు బోడ రాజు,కుమ్మరి సాగర్ మాట్లాడుతూ పాఠశాల పక్కన వైన్షాప్ ను నిర్వహించడం వల్ల విద్యార్థులు అసౌకర్యానికి గురి అవుతున్నారని తెలియజేయడం జరిగింది. విద్యార్థుల సౌకర్యార్థం వైన్ షాప్ ను వెంటనే తొలగించాలి. విద్యార్థులకు న్యాయం చేయాలని వారు డిమాండ్ చేశారు లేనియెడల విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో ఆందోళన కార్యక్రమాలు నిర్వహిస్తామని వారు డిమాండ్ చేశారు.ఈ కార్యక్రమంలో మారేపల్లి నవీన్,రాకేష్,గణేష్, దేవరాజ్,రాజ్ కుమార్,సురేష్ తదితరులు పాల్గొన్నారు.