నాగబాబు వ్యాఖ్యలతో సర్వత్రాచర్చ

 


 ( జనం సాక్షి):  
సర్కార్‌ తీరుపై పవన్‌ అభిమానుల ఆందోళన
పవర్‌ స్టార్‌ పవన్‌ కళ్యాణ్‌ ’భీమ్లానాయక్‌’ చిత్రానికి ఆంధ్రాలో టికెట్‌ రేట్ల విషయంలో వైసిపీ ప్రభుత్వం తీరును మెగా బ్రదర్‌ నాగబాబు ఎండగట్టారు. ఆయనచేసిన కామెంట్లు ఇప్పుడుప్రకంపనలు సృష్టిస్తున్నాయి. ఏరంగాన్ని వదలకుండా దోచుకుంటున్నారని ఆయనచేసిన వ్యాక్యలు సర్వత్రాచర్చగా మారయి. ’వైసిపి ప్రభుత్వం కి, వాళ్ళ మినిస్టర్స్‌ కు సినిమా వాళ్ళ ఆపరేషన్స్‌ గురించి తెలీదన్నారు. వైసిపి వాళ్లు తమకున్న పర్సనల్‌ ఎజెండా పవన్‌ కళ్యాణ్‌ని అణగ తొక్కెయ్యలని, విూకు పడని వర్గం వాళ్ల హీరోల ఆర్థిక మూలాలను కొట్టేయాలని ప్లాన్‌ చేస్తున్నారు. దానికోసం సినిమా ఇండస్ట్రీ విూద పడ్డారు. ఆంధ్రలో ఎవ్వరూ ఏ వ్యాపారం చేసుకున్న ఆ వ్యాపారాన్ని విూరే తిసేసు కుంటున్నారు. విూరే వెల్లంపల్లి శ్రీను, కొడాలి నాని లాంటి వాళ్ళను హీరోలుగా పెట్టీ సినిమాలు తియ్యండి. దాని వల్ల ఆంధ్రలో సినిమా ఇండస్ట్రీ డవలప్‌ అవుతుంది. విూ ఎమ్మెల్యేలు, ఎంపిల ముందు మేము మంచి నటులం కాదు. తెలుగు
సినిమాని ఆంధ్రలో బ్యాన్‌ చెయ్యండి. మాకు నష్టం లేదు. టెక్నాలజీ డెవలప్‌ అయ్యింది. యూట్యూబ్‌లో, ఓటిటి లతో డిజిటల్‌ లోనో మాకు డబ్బులు వస్తాయని ఘాటుగా స్పందించారు. ఇప్పుడు మాట్లాడుతున్న వైసిపి నాయకులు అజ్ఞానంతో మాట్లాడుతున్నారు. చిరంజీవిగారు కొంతమంది హీరోలతో వెళ్లి జగన్‌ గారితో మాట్లాడారు. మరి జీవో ఇవ్వడానికి ఇంత లేట్‌ ఏమిటి? జీవో ఇవ్వకుండా పాత జీవోనే పెట్టడం వల్ల అయ్యా.. అంటూ పవన్‌ కల్యాణ్‌, మేమందరం వస్తామనుకున్నారా... మేం రాము. మా సినిమా వాళ్ల ఆర్థిక మూలాలను కొట్టేసి జీవితాలను తారుమారు చేసేద్దామని అనుకుంటున్నారేమో. అది ఎప్పటికీ జరుగదు. సినిమా హీరోలు శారీరకంగా ఎన్నో దెబ్బలు తింటూవుంటారు. ఆ దెబ్బలు కనుక విూరు... అంటే ఎక్కువ రెమ్యునరేషన్‌ తీసుకుంటున్నారు.. అని చెపుతున్న వాళ్ళు తింటే కనీసం ఒక సంవత్సరం ఐసియులో వుంటారని మండిపడ్డారు. హీరోలు ఎంతో కష్టపడుతూ సినిమా హిట్‌ అవుతుందా ప్లాప్‌ అవుతుందా అనే భయంతో బ్రతుకుతూ వుంటారు. తెలుగు హీరోల రెమ్యునరేషన్‌ తక్కువ, తమిళ్‌ బాలీవుడ్‌ హాలీవుడ్‌ లలో సినిమా సింహ భాగం రెమ్యునరేషన్‌ హీరోలే తీసుకుంటారు. ఈ రేట్లు పెట్టకపోయి వుంటే బాలకృష్ణ ’అఖండ’ సినిమాకి పది కోట్లు వచ్చేవి.. ఆ విషయంలో అయన మాట్లాడలేక పోవడం అయన వ్యక్తిగత విషయం. నాగార్జున బంగార్రాజు ఇంకొక పదిహేను కోట్లు వచ్చేవి. కానీ తగ్గినా పర్వాలేదు అని రిలీజ్‌ చేశారు. చిరంజీవి గారు తన హుందాతనాన్ని పక్కన పెట్టి ఆత్మ గౌరవాన్ని తగ్గించుకొని ఇండస్టీన్రీ నమ్ముకున్న లక్షలాది కార్మికుల కోసం వెళ్లారు. వైసిపి వారు ఒక భ్రమలో బతుకుతున్నారు. విూరు అయిదు సంవత్సరాలు మాత్రమే వుండే ప్రజా ప్రతినిధులు. అంబేద్కర్‌ గారు అయిదు సంవత్సరాల కొకసారి ఎలక్షన్స్‌ పెట్టమన్నది. వైసిపి వాళ్ల కోసమే. ఇలాంటి నిరంకుశత్వం ఫ్యూడలిస్ట్‌ భావాలు వున్న వాళ్ళు వస్తారు. ప్రజలకి సేవ చేయాలంటే అయిదు సంవత్సరాలకు కొకసారి ఎలక్షన్‌ పెట్టారు. విూరు ఎవరిని సంతోషంగా వుండనిస్తున్నారు? మనః శాంతిగా ఎవ్వరిని వుండనిస్తున్నారు? అంటూ మండిపడ్డారు. తిరుపతిలో రేట్లు పెంచేస్తారు. ఇసుక రేట్లు విపరీతంగా పెంచారు. ఏ వర్గం వాళ్లు విూ పరిపాలనలో హ్యాపీగా వున్నారో చెప్పండి. వ్యవసాయ దారులు హ్యాపీగా వున్నారా? భవన నిర్మాణ కార్మికులు హ్యాపీగా వున్నారా? చేనేత కార్మికులు, కల్లుగీత కార్మికులు హ్యపీగా వున్నారా? నవరత్నాలు పెట్టి, మిగతా తొంభై శాతం ద్వంసం చేసేస్తున్నారు’... అంటూ నాగబాబు వైసీపీ ప్రభుత్వం తీరుపై మండిపడ్డారు.