ఉమ్మడి ఎపి విభజనలో కాంగ్రెస్‌ తీరు అభ్యంతరకరం

\


హడావిడి నిర్ణయంతో ఆ రాష్టాల్ల్రో అనేక సమస్యలు

బిజెపి మూడు రాష్టాల్ర ఏర్పాటులో సమస్యలు లేవు
రాజ్యసభలో మరోమారు విభజనపై మోడీ వ్యాఖ్యలు
న్యూఢల్లీి,ఫిబ్రవరి8 (జనం సాక్షి) : ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ విభజనపై ప్రధాని నరేంద్ర మోడీ కీలక వ్యాఖ్యలు చేశారు. రాజ్యసభలో మాట్లాడిన ఆయన.. అనేక అంశాలపై స్పందించారు. కాంగ్రెస్‌ పార్టీ రాష్ట్ర విభజన సరిగ్గా చేసి ఉంటే ఇలాంటి సమస్యలు ఉండేవి కావన్నారు.. మరోవైపు.. రాష్ట్ర విభజనకు మేం వ్యతిరేకం కాదని అంటూనే.. రాజకీయ స్వార్థం కోసం ఏపీని హడావుడిగా విభజించారని ఆరోపించారు. అయితే విభజిత రాష్టాల్ల్రో కాంగ్రెస్‌ పార్టీని ప్రజలు నమ్మలేదన్నారు. అయితే విభజన కోసం అనుసరించిన పద్ధతి సరికాదన్నారు.. తలుపులు మూసి పేపర్‌ స్పే కొట్టారని నాటి ఘటనలను గుర్తుచేశారు.. ఎలాంటి చర్చ జరగకుండానే విభజన బిల్లును ఆమోదించారని విమర్శించారు.. రాజ్యసభలో రాష్ట్రపతి ప్రసంగంపై చర్చ సందర్భంగా ప్రధాని మోడీ ఈ వ్యాఖ్యలు చేశారు. యూపీఏ 2 ప్రభుత్వంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ను తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌గా కాంగ్రెస్‌ ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే.. ఈ సందర్భంగా విభజన చట్టంలో పేర్కొన్న అనేక అంశాలు ఇప్పటికీ అమలుకు నోచుకోవడం లేదన్నారు. ఎన్నో దఫాలుగా అటు ఆంధ్రప్రదేశ్‌, ఇటు తెలంగాణ.. కేంద్రం దృష్టికి సమస్యలను తీసుకెళ్లినా పరిష్కారం కాని సమస్యలు ఎన్నో ఉన్నాయి.. ఇక, ఏపీకి ప్రత్యేక హోదా ఇచ్చే విషయమై కేంద్ర ప్రభుత్వం చెప్పేవన్నీ కుంటిసాకులే అంటూ రాజ్యసభలో సోమవారం వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్లమెంటరీ పార్టీ నేత విజయసాయి రెడ్డి ధ్వజమెత్తిన విషయం తెలిసిందే.. సరైన పద్ధతిలో తెలంగాణ, ఏపీ విభజన జరగలేదన్నారు. కాంగ్రెస్‌ పార్టీ వల్లే ఇప్పటికే ఆ రెండు రాష్టాల్ర మధ్య ప్రచ్ఛన్న పరిస్థితులు నెలకొన్నట్లు మోదీ ఆరోపించారు. అటల్‌జీ మూడు రాష్టాల్రను విభజించారని, కానీ చాలా శాంతిపూర్వకంగా ఆ రాష్టాల్ర విభజన జరిగినట్లు మోదీ చెప్పారు.