టిఆర్‌ఎస్ నుంచి నిర్మల్ మున్సిపల్ వైస్ సస్పెన్షన్
సాజిద్‌పై చర్యకు బిజెపి డిమాండ్నిర్మల్,ఫిబ్రవరి28 ( జనం సాక్షి): బాలికపై లైంగికదాడికి పాల్పడ్డాడనే ఆరోపణలు ఎదుర్కొంటున్న నిర్మల్ మున్సిపల్ వైస్ చైర్మన్ షేక్ సాజిద్‌ను టీఆర్‌ఎస్ పార్టీ నుంచి సస్పెండ్ చేసినట్లు అటవీ, పర్యావరణ శాఖ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి తెలిపారు. సాజిద్‌పై వచ్చిన ఆరోపణల నేపథ్యంలో పార్టీ ప్రాథమిక సభ్యత్వాన్ని రద్దు చేసినట్లు పేర్కొన్నారు. తక్షణమే సస్పెన్షన్ అమల్లోకి వస్తుందన్నారు. సోమవారం ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విూడియా సమావేశంలో వివరాలను వెల్లడిరచారు. మరోవైపు లైంగిక ఘటనను హేయమైన చర్యగా ఖండిరచారు. బాధితురాలికి న్యాయం జరిగేలా చూస్తామని తెలిపారు. బాలికపై లైంగిక దాడి చేసినట్లు సాజిద్‌పై ఫిర్యాదు చేసిన వెంటనే పోలీసులు పోక్సోచట్టం కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారన్నారు. ఇదిలావుంటే నిర్మల్ మున్సిపల్ కార్యాలయం వద్ద ఉద్రిక్తత చోటు చేసుకుంది. బాలికపై అత్యాచారం చేసిన మున్సిపల్ వైస్ చైర్మన్ సాజిద్‌ను పదవి నుంచి తొలగించాలని
బీజేపీ ఆందోళనకు దిగింది. మున్సిపల్ చైర్మన్ ఈశ్వర్, టీఆర్‌ఎస్ కౌన్సిలర్లతో వాగ్వాదానికి దిగారు. దీంతో ఇరు వర్గాల మధ్య తోపులాట జరిగింది. వైస్ చైర్మన్‌ను కాపాడేందుకు టీఆర్‌ఎస్ ప్రయత్నిస్తోందని బీజేపీ ఆరోపించింది.