రాష్ట్రంలో కరోనా థర్డ్‌వేవ్‌ ముగిసింది


ప్రజలు మాస్కులు ధరిస్తూ జీవితం గడపాలి

ఉద్యోగులకు ఇక వర్క్‌ఫ్రమ్‌ హోమ్‌ అక్కర్లేదు
టీకా తీసుకున్న వారిలో కరోనా ప్రభావం తక్కువ
సత్ఫలితాలు ఇచ్చి ఇంటింటి ఫీవర్‌ సర్వే
విద్యాసంస్థలను పూర్తిగా తెరుచుకోవచ్చు
మరో వేరియంట్‌ రాదు..వచ్చినా ఎదుర్కొనేందుకు సిద్దం
ఎలాంటి కోవిడ్‌ ఆంక్షలు లేవన్న వైద్యారోగ్య శాఖ
వివరాలు వెల్లడిరచిన ప్రజారోగ్య సంచాలకులు శ్రీనివాస్‌ రావు
హైదరాబాద్‌,ఫిబ్రవరి8(జనం సాక్షి): తెలంగాణలో కరోనా థర్డ్‌ వేవ్‌ ముగిసిందని ప్రభుత్వం ప్రకటించింది. ఇక మరో వేరియంట్‌ ఇప్పట్లో వచ్చే అవకాశం కూడా లేదని రాష్ట్ర ప్రజారోగ్య సంచాలకులు శ్రీనివాస్‌ రావు స్పష్టం చేశారు. కరోనా పరిస్థితులపై శ్రీనివాస్‌ రావు విూడియాతో మాట్లాడారు. రాష్ట్రంలో జనవరి 28న థర్డ్‌ వేవ్‌ ఉధృతి ముగిసిందని పేర్కొన్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో ఎలాంటి కొవిడ్‌ ఆంక్షలు లేవని చెప్పారు. కరోనా కేసులు తగ్గుముఖం పట్టాయని స్పష్టం చేశారు. వారంరోజుల్లో వందలోపే కేసులు నమోదు అవుతాయన్నారు. టీకా తీసుకున్న వారిలో ప్రభావం తక్కువగా ఉందన్నారు. రాష్ట్రంలో పాజిటివిటీ రేటు 2 శాతం కంటే తక్కువగా ఉందని తెలిపారు. అత్యధిక పాజిటివిటీ రేటు 5 శాతానికి వెళ్లిందన్నారు. ఫీవర్‌ సర్వే ద్వారా ఆరోగ్య కార్యకర్తలు ఇంటింటికీ వెళ్లి కిట్లు అందజేశారని చెప్పారు.
కొవిడ్‌ వల్ల రెండేండ్లుగా ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొన్నామని శ్రీనివాస్‌ రావు తెలిపారు. ఐటీ సంస్థలు వర్క్‌ ఫ్రం హోం విరమించుకోవచ్చని సూచించారు. అన్ని సంస్థలు వంద శాతం పని చేయవచ్చు అని
చెప్పారు. ఉద్యోగులు పూర్తి సంఖ్యలో కార్యాలయాలకు వెళ్లొచ్చన్నారు. విద్యాసంస్థలను పూర్తిగా ప్రారంభించామని తెలిపారు. ఆన్‌లైన్‌ తరగతులతో పిల్లల్లో మానసిక సమస్యలు రావొచ్చన్నారు. కేసులు తగ్గినా మాస్కులు ధరించాలని ఆదేశించారు. అందరూ కొవిడ్‌ టీకా తీసుకోవాలి అని డాక్టర్‌ శ్రీనివాస్‌ రావు సూచించారు. కరోనా మూడు వేవ్‌ల రూపంలో ప్రపంచాన్ని పట్టి పీడిరచిందన్నారు. ఫస్ట్‌ వేవ్‌ 10 నెలలు, సెకండ్‌ వేవ్‌ 6 నెలలు, థర్డ్‌ వేవ్‌ మూడు నెలలు మాత్రమే ఉందని అన్నారు. ఇకముందు ఎలాంటి ఆంక్షలు అక్కర్లేదన్నారు. కేంద్రం కూడా ఆంక్షలు ఎత్తివేసిందని డీహెచ్‌ చెప్పారు. అలాగే ఎన్ని వేరియంట్లు వచ్చినా ఎదుర్కోగలమని ధీమా వ్యక్తం చేశారు. ఇప్పట్లో కొత్త వేరియంట్లు వచ్చే అవకాశం లేదన్నారు. వ్యాక్సిన్‌తోనే కరోనాను సమర్థంగా ఎదుర్కొన్నామని తెలిపారు. కేసులు తగ్గినా ఫీవర్‌ సర్వే కొనసాగుతుందన్నారు. కరోనాను సీజనల్‌ ఫ్లూగా పరిగణనలోకి తీసుకునే అవకాశం ఉందని డీహెచ్‌ శ్రీనివాస్‌ వెల్లడిరచారు. ప్రభుత్వ జాగ్రత్తలతో కరోనా నుంచి బయటపడ్డామని అన్నారు. ఫీవర్‌ సర్వే మంచి ఫలితాలు ఇచ్చిందని చెప్పారు. వారం రోజుల్లోనే మొదటి విడత ఫీవర్‌ సర్వే పూర్తవుతుందని పేర్కొన్నారు. రెండు నెలల్లోనే థర్డ్‌ వేవ్‌ ముగింసిందన్నారు. కరోనా నుండి త్వరగా బయటపడటానికి వ్యాక్సిన్‌ సమర్థవంతంగా పని చేసిందని వెల్లడిరచారు. భవిష్యత్‌ లో ఎలాంటి వేరియెంట్‌ వచ్చినా ఎదుర్కొనేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందన్నారు. ప్రజలు కరోనా జాగ్రత్తలు పాటిస్తు రెగ్యులర్‌ లైఫ్‌ లీడ్‌ చేయవచ్చని చెప్పారు. సమ్మక్క,సారక్క జాతరలో వైద్య ఆరోగ్యశాఖ ప్రత్యేక ఏర్పాట్లు చేసిందని పేర్కొన్నారు. మొదటి డోస్‌ వ్యాక్సిన్‌ 100 శాతం పూర్తి చేశామన్నారు. రెండో డోస్‌ 82 శాతం పూర్తి
అయిందని తెలిపారు. టీనేజ్‌ వ్యాక్సిన్‌ మొదటి డోస్‌ 73 శాతం పూర్తి అయిందని వెల్లడిరచారు. కొత్త వేరియెంట్‌ వచ్చే అవకాసం చాలా తక్కువ అని చెప్పారు. కరోనాను రానున్న రోజుల్లో సాధారణ ఫ్లూగా పరిగణలోకి తీసుకునే అవకాశం ఉందన్నారు.