మేడారం యాప్ తయారు చేసిన వరంగల్


ములుగు(మేడారం),ఫిబ్రవరి11(జనం సాక్షి):-

ములుగు జిల్లా తాడ్వాయి మండలంలోని మేడారం జాతరకు ఆధునికతను జోడిస్తూ ఆర్టీసికి వరంగల్ కిట్స్ కళాశాల విద్యార్థులు యాప్ ను తయారు చేసి అందించారు. ఆ యాప్ లో ములుగు జిల్లాలోని పర్యాటక ప్రదేశాలు, అక్కడి సౌకర్యాలు,హోటళ్ల సమాచారం పొందుపరిచారు. ఈ యాప్ లో డ్రైవర్లకు ఎక్కడైనా బస్ ట్రబుల్ ఇస్తే ఎమర్జెన్సీ బటన్ క్లిక్ చేస్తే సమాచారం డిపోకు చేరుతుందని,ఇంకా ప్రయాణికులు ఎమర్జెన్సీ బటన్ క్లిక్ చేస్తే తమకు వెంటనే సాయం అందుతుందన్నారు.