సమిష్టి భావనకు కేంద్రంగా సమతా క్షేత్రం


ప్రజల్లో ఆలోచలనలు రేకెత్తిస్తున్న రామానుజులు

ఏకతాభావంతో సాగేలా జనంలో మార్పునకు సంకేతం
హైదరాబాద్‌,ఫిబ్రవరి10(జనంసాక్షి): రామానుజ సహస్రాబ్ది ఉత్సవాలు చరిత్రలో నిలిచిపోయే ఓ అద్భుత ఘట్టంగా మారనున్నాయి. ఎన్నో అద్భుతాలతో కేవలం జనాన్ని ఆకట్టుకునే ఓ ఆకర్షణీయ పర్యాటక కేంద్రంగగా మాత్రమే కాకుండా ఓ అద్భుతమైన సందేశాన్ని జీయర్‌ స్వామి అందిస్తున్నారు. ఈ క్షేత్రం సమతా క్షేత్రంగా మారనుంది. ప్రజలంతా ఒక్కటే అన్న రామానుజాచార్యుల మతం నెరవేరే అవకాశాలు కనిపిస్తున్నాయి. ప్రజలంతా ఒక్కటే అన్న భావనను ఆధ్యాత్మిక చింతనతో రామానుజులు చేసిన ప్రయత్నం సాకారం అయ్యేలా దారిచూపుతోంది. కోట్లు పెట్టి, అత్యాధునిక టెక్నాలజీని ప్రయోగించి, ఓ బృహన్మూర్తిని ప్రతష్ఠించిన సంకల్పం నెరవేరుతందనడంలో సందేహం లేదు. ఎందుకంటే ఇప్పుడు ఇక్కడికి వస్తున్న నేతలను పక్కన పెడితే ప్రజలు అంతా కులమతాలతో సంబంధం లేకుండా దర్శించుకుంటున్నారు. ఈ సమతా క్షేత్రం గురించి గొప్పగా అందరూ చెప్పుకోవాలనే తపన నెరవేరబోతున్నది. రికార్డులూ, రివార్డుల కోసం దీనిని ఏర్పాటు చేయలేదు. శ్రీశ్రీశ్రీ త్రిదండి రామానుజ చిన్న జీయర్‌ స్వామివారి ఆధ్వర్యంలో ఏకత్రితం అవుతున్న ధర్మాచార్య మండలి దీనికి సమాధానం చెపుతోంది... సేతుబంధనం అనే ఓ అద్భు పదాన్ని వినిపించింది... సేతుబంధం అంటే ఆగట్టునీ ఈ గట్టునీ కలపడం... రెండు భిన్నమైన పాయలను కలిపే బ్రిడ్జ్‌... సమాంతరంగా సాగే రెండు దారుల్ని కలిపే అనుసంధానం... ఇవాళ దేశంలో జరగాల్సింది ఇదేనని ఓ చారిత్రక సందేశాన్ని బలంగా పంపింది ఈ సహస్రాబ్ది సమారోహం... ఎన్నో సంప్రదాయాలు, ఆచారాలు, ఆచరణలు, సంస్కృతులు, నమ్మకాలు, దైవారాధనలు మనదేశంలో ఉన్నాయి. ఈ దేశంలో... దేనికది అదేగొప్ప అన్న స్వాతిశయంలో వున్నాయి. ఏ రెంటి మధ్యా సమానత్వం లేదు. ఇదే మన పునాదుల్ని నిర్వీర్యం చేస్తోంది... అందుకని ఈ వేర్వేరు పాయల్ని కలిపే దుర్భేద్యమైన సేతువు కావాలి... నాదెక్కువ నీది తక్కువ అ నే ఛాందసం పోయి సమానత్వ భావనతో శిలాసదృశంగా, దుర్భేద్యంగా మారాలి... అదిగో... సరిగ్గా అలాంటి సేతుబంధమే ఏర్పడిరది ఈనాటి సహస్రాబ్ది ఘట్టంతో...!! శ్రీరామాను జులది కేవలం చూడ్డానికి ఓ పంచలోహ విగ్రహం మాత్రమే కాదని, భిన్న సంప్రదాయాలకు ఆలోచనా ధారలకు చెందిన అందరూ ఏకత్వ భావనతో ఒక్కటవ్వాలనే సందేశంతో ఇవాళ శ్రీశ్రీశ్రీ త్రిదండి చిన్న జీయర్‌ స్వామివారి నేతృత్వంలో ధర్మాచార్య మండలి కదులుతోంది... ఈ కదలికకు స్ఫూర్తి శ్రీ భగవత్‌ రామానుజులే... దేశం దుర్భేద్యంగా మారేందుకు ఆకాశమంత ఎత్తున ప్రతిష్ఠితుడై రామానుజులే స్వయంగా నేతృత్వం వహిస్తున్నారు... ఆ ఆచార్యుడి స్ఫూర్తే మొన్న ప్రధాని మోడీని, గృహమంత్రి అమిత్‌ షాని, మన కేఆర్‌నీ, జగన్‌నీ, మధ్యప్రదేశ్‌ సింఎం శిరాజ్‌సింగ్‌ చౌహాన్‌నీ, ఆర్‌ఎస్‌ఎస్‌ చీఫ్‌ మోహన్‌ భగవత్‌ మొదలుకుని అందరినీ కదిలిస్తోంది... పాలనలో రామానుజుల ఆదర్శం మాకో కొత్త ఒరవడిని, మార్గాన్నీ, ప్రేరణనీ చూపిస్తోందని ఈ నేతలందరూ ఏకకంఠంతో చెబుతున్నారంటే` ఓగొప్ప భావ విప్లవానికి నాంది పడుతున్న సంకేతాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఓ గొప్ప సామాజిక విప్లవానికి అడుగు పడిరది. అది పరుగుగా మారి మనందరిని కలుకని పోతుందనడంలో సందేహం లేదు.