దారులన్నీ ఏడుపాయల జాతర వైపే                   

1. కోరిన కోర్కెలు తీర్చే కల్పవల్లిగా విరాజిల్లుతున్న ఏడుపాయల వన దుర్గా భవాని మాత .

2. నేటి నుండి మూడు రోజుల పాటు మహాశివరాత్రి ఉత్సవాలు
3. మహాశివరాత్రి సందర్భంగా ఏడుపాయల జాతర ఉత్సవాలు
4. నేటి నుండే మహాశివరాత్రి ఉత్సవాలు ప్రారంభం
5. అమ్మవారికి ప్రభుత్వం తరఫున పట్టు వస్త్రాలు సమర్పించనున్న  ఆర్థిక, వైద్య ఆరోగ్య శాఖ మంత్రి హరీష్ రావు   
6. ఏడుపాయల లోనే మకాం వేసిన జిల్లా అధికార యంత్రాంగం                
 జనంసాక్షి /పాపన్నపేట   తెలంగాణ రాష్ట్రంలోని కాకుండా ప్రపంచ వ్యాప్తంగా ప్రసిద్ధి చెందిన పుణ్యక్షేత్రం ఏడుపాయల వన దుర్గ భవాని దేవస్థానం తెలంగాణ రాష్ట్రంలో సమ్మక్క సారలమ్మ తర్వాత అత్యంత ప్రసిద్ధి చెందిన జాతర ఇది ఈనెల   ఒకటి  నుండి  సుమారు వారం రోజుల పాటు ఇక్కడ ఉత్సవాలు ఘనంగా జరుగుతాయి నేటి నుండి మూడు రోజులు వరకు జరిగే ప్రధాన ఘట్టాలు ఇక్కడ ఎంతో ప్రాధాన్యం సంతరించుకున్నాయి మొదటిరోజు అమ్మవారికి ఉపవాసం ఉండి భక్తి శ్రద్ధలతో అమ్మవారికి వివిధ రూపాలలో మొక్కులు చెల్లించుకుంటారు రెండవ రోజు బండ్ల ఊరేగింపు ఏడుపాయల జాతర లో బండ్ల ఊరేగింపు ఎంతో ప్రాధాన్యత ఉంది తరతరాలనుండి వస్తున్న ఈ సంప్రదాయానికి ఎంతో ప్రాధాన్యత నిస్తారు ఏడుపాయల జాతర లో బండ్ల ఊరేగింపు ఘట్టాన్ని చూడటానికి భక్తులు ఎంతో ఆసక్తిని చూపుతారు మూడవరోజు రథోత్సవం ఈ వ్రత ఉత్సవానికి కూడా ప్రాధాన్యత కలిగి ఉంది ఆనవాయితీ ప్రకారం వస్తున్న సంప్రదాయాల ప్రకారం ఇక్కడ ఉన్న అన్ని కులాలకు చెందిన వారు రథోత్సవానికి వారి వారి జీవన  వైవిధ్యాన్ని ప్రదర్శించేందుకు పోటీపడుతుంటారు   ...... ఏడుపాయల లో జరిగే మహాశివరాత్రి వేడుకలకు భక్తులు బయల్దేరుతున్నారు పక్షుల కిలకిల రాగాలు గల గల పారే సెలయేర్లు ఎటుచూసినా పచ్చని దట్టమైన అడవి అడవి మధ్యలో పెద్ద పెద్ద బండ రాళ్లు వాళ్లకు తెల్లని సున్నం తో పాటు జాజు నామాలతో ఎంత చూసినా తనివి తీరని రమణీయ దృశ్యాలు ఏడుపాయల జాతర ప్రత్యేకత ఇంతటి ప్రశాంతత ఉన్న ఏడుపాయల్లో నేటి నుండి మూడు రోజుల పాటు జరిగే ఉత్సవాలను తిలకించేందుకు దాదాపుగా పది నుండి పదిహేను లక్షల భక్తజనం హాజరుకానున్నట్లు అధికారులు అంచనా వేస్తున్నారు ఇప్పటికే ఏడుపాయల్లో కట్టుదిట్టమైన చర్యలు చేపట్టారు పోలీసుల డేగ కన్నులతో సీసీ కెమెరాలతో జాతరలో ఎప్పటికప్పుడు పర్యవేక్షణలో పాలుపంచుకుంటున్నారు జిల్లాలో అన్ని శాఖల అధికారులు సమన్వయంతో పనిచేసి ఏడుపాయల జాతర ను విజయవంతం చేయాలని అధికారులను పలుమార్లు ఇప్పటికే జిల్లా పాలనాధికారి సూచించారు  మెదక్ జిల్లా ఎస్పీ  నేతృత్వంలో ఆయా శాఖల అధికారులు ఎప్పటికప్పుడు ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నారు ఇదిలా ఉండగా పోలీస్ శాఖ జాతర ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ముందస్తు చర్యగా మూడంచెల విధానాన్ని భారీ బందోబస్తు నిర్వహించి ఎప్పటికప్పుడు కఠినమైన చర్యలు తీసుకుంటున్నారు అలాగే జిల్లా పాలనాధికారి అన్ని శాఖల సమన్వయంతో జాతరకు వచ్చే భక్తులకు ఎలాంటి అసౌకర్యాలు కలగకుండా అన్ని శాఖల అధికారుల కు ఆదేశాలు జారీ చేశారు.. జిల్లా పాలనాధికారి ఆదేశానుసారం నిర్వహిస్తున్న ఏడుపాయల జాతర ఉత్సవాలు ప్రపంచంలోనే ప్రఖ్యాతి తెచ్చే విధంగా అందరు సహకరించి సమిష్టిగా పనిచేయాలని అన్ని శాఖల అధికారులను ఆదేశించారు దీనితో జాతర ప్రాంగణమంతా ఎటు చూసిన అధికారులు భక్తులకు అసౌకర్యాలు కలగకుండా భక్తుల సౌకర్యాల కోసం స్నానఘట్టాలు వ్యక్తిగత మరుగుదొడ్లు విద్యుత్ దీపాలు  తదితర వాటిని ఏర్పాటు చేయడంలో అన్ని శాఖల అధికారులు విలీనమై పోయారు     ...ఏడుపాయల జాతరకు ఇలా వెళ్లాలి... మహాశివరాత్రి పర్వదినాన్ని నేటి నుండి ప్రారంభమయ్యే జాతరకు వెళ్లేందుకు వివిధ ప్రాంతాల నుండి ఆర్టీసీ ప్రత్యేక బస్సులు నడుపుతుంది హైదరాబాద్ నుండి చేగుంట మీదుగా వచ్చే బస్సు లో మెదక్ లో దిగితే అక్కడి నుండి జాతరకు ప్రత్యేక బస్సులు ఉంటాయి నర్సాపూర్ మీదుగా వచ్చే భక్తులు నేరుగా ఏడుపాయల కు ప్రత్యేక బస్సులు ఏర్పాటు చేశారు జైరాబాద్ సంగారెడ్డి మీదుగా వచ్చే భక్తుల కోసం ప్రత్యేక బస్సులు ఏర్పాటు చేసినట్లు ఆర్టీసీ డి ఎం  తెలిపారు ఏడుపాయల జాతర కోసం నారాయణఖేడ్ సంగారెడ్డి మెదక్ హైదరాబాద్ బాలానగర్ గజ్వెల్ ప్రజ్ఞాపూర్ సిద్దిపేట డిపోల నుండి దాదాపు 200 ప్రత్యేక బస్సులు నడుపనున్నట్లు ఆర్టీసీ అధికారులు వెల్లడించారు...... స్థల పురాణం..... మెదక్ జిల్లా పాపన్నపేట మండలం నాగ్సా న్ పల్లి గ్రామ సమీపంలో ఈ జాతర జరుగుతుంది మంజీరా నది ఏడుపాయల చీలిపోయిన చోట దుర్గామాత కు జాతర చేస్తారు జనమేజయ రాజు సర్పయాగంలో సర్పజాతి అగ్ని ఆహుతి కాగా తల్లి అయిన కద్రువ పుత్రశోకంతో కమిలిపోతుంది తన సవతి అయిన వినుత సహాయంతో ఆమె కుమారుడైన గరుత్మంతుని వేడుకోగా నాగజాతికి పుణ్యగతులు కలిగించమని ప్రాధేయపడుతుంది అప్పుడు గరుత్మంతుడు గంగా దేవిని ప్రార్థించి తన తమ్ముళ్లకు మోక్షాన్ని ప్రసాదించమని ప్రాధేయపడతాడు గంగాదేవి గరుత్మంతుని భక్తికి పరోపకార నిరతికి మెచ్చుకుని తన కాలి అందె నుండి ఒక గజె తీసి ఇచ్చింది అని ఆనవాయితీ నేటికీ ఇదే నానుడి దీనివల్ల నీ కోరిక నెరవేరుతుందని చెప్పింది గరుత్మంతుడు భక్తిశ్రద్ధలతో అది తీసుకొని కళ్ళకద్దుకొని ముక్కున కరచుకొని వస్తుండగా జారి కింద పడి నదిగా మారి ప్రవహించినట్టు పురాణాలు చెబుతున్నాయి గరుక్మంతుడు సర్పయాగ స్థలానికి రాగానే నది ఏడుపాయలుగా చిలీ  నాకు మృతదేహాలను పునీతం చేసి పుణ్య లోకాలకు పంపిస్తుంది గంగాదేవి కాలి అందె ఇచ్చిన కారణంగా ఆ నదికి మంజీరా అనే పేరు వచ్చింది ఏడుపాయలుగా తీరడం వలన ఏడుపాయల జాతర ప్రసిద్ధి పొందింది ఈ జాతర గంగాధర పరమ శివుని పూజించే మహా శివరాత్రి రోజు భక్తులు జరుపుకోవడం మరో విశేషం ఈ జాతర లో సంస్కృతి ఎక్కువగా తెలంగాణ ప్రాంతానికి పరిమితమైంది జానపదుల ఆచారం ఒగ్గుకథ విన్యాసాలు శివసత్తుల శివలతో నేటికి అమ్మవారిని ప్రతినిత్యం కొలుస్తూ వుంటారు నాటి పురాణాల ఫలితమే నేటి మహా శివరాత్రి  జాగరణ ఏడుపాయలుగా విరాజిల్లుతుంది