ఇంచార్జ్ డీజీపీ అంజనీ కుమార్
హైదరాబాద్,ఫిబ్రవరి23( (జనం సాక్షి)): రాష్ట్రంలో మతసామరస్యాన్ని దెబ్బతీసే వారిపట్ల కఠినంగా వ్యవహరించాలని నేడు డీజీపీ కార్యాలయంలో జరిగిన సీనియర్ పోలీస్ అధికారుల సమావేశంలో ఇంచార్జ్ డీజీపీ అంజనీ కుమార్ అన్నారు. రాచకొండ కమిషనరేట్ పరిధిలో గతరాత్రి జరిగిన సంఘటన నేపథ్యంలో ఇంచార్జ్ డీజీపీ అంజనీ కుమార్ నేడు నగరంలోని ముగ్గురు పోలీస్ కవిూషనర్లు, సి.వీ.ఆనంద్, మహేష్ భగవత్, స్టీఫెన్ రవీంద్ర, ఇంటలిజెన్స్, శాంతి భద్రతల విభాగం అడిషనల్ డీజీలు అనీల్ కుమార్, జితేందర్, నార్త్ జోన్ ఏడీజీ నాగి రెడ్డి లతో సవిూక్షా సమావేశం నిర్వహించారు. చట్టాన్నితమ చేతుల్లోకి తీసుకోవాలని ప్రయత్నించే ఏ వ్యక్తినిగానీ, గ్రూపులను గానీ సహించేది లేదని ఆ సమావేశంలో నిర్ణయించారు. గతరాత్రి సంఘటనకు సంబంధించి రాచకొండ కవిూషనర్ ఇప్పటికే 5 కేసులు నమోదు చేసి, పలువురు దుండగులను అదుపులోకి తీసుకున్నారు. చట్టాలను అతిక్రమించే ఎంతవారినైనా వదిలే ప్రసక్తే లేదని, వారిపై హిస్టరీ షీట్ లను, కమ్యూనల్ షీట్ లను తెరవాలని ఈ సమావేశంలో
నిర్ణయించారు.. అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న తెలంగాణ రాష్ట్రంలో రాష్ట్ర ప్రతిష్టను భంగం కలిగించి మత విద్వేషాలను రేకెత్తించే శక్తులను ఎట్టిపరిస్థితుల్లో అనుమతించమని హెచ్హరించారు.