డ్రగ్స్‌కట్టడికి ప్రత్యేక నిఘావిభాగం

 

 



` హైదరాబాద్‌లో నార్కోటిక్‌ ఎన్ఫోర్స్‌మెంట్‌ వింగ్‌ ఏర్పాటు :సిపి ఆనంద్‌
హైదరాబాద్‌,ఫిబ్రవరి 9(జనంసాక్షి):నగరంలోని పోలీస్‌ కమిషనర్‌ కార్యాలయంలో నార్కోటిక్‌ ఎన్ఫోర్స్‌ మెంట్‌ వింగ్‌ విభాగాలు ఏర్పాటు అయ్యాయి. బుధవారం డీజీపీ మహేందర్‌ రెడ్డి, నగర సీపీ సి.వి ఆనంద్‌ ఈ విభాగాలను ప్రారంభించారు. హైదరాబాద్‌ నార్కోటిక్స్‌ ఎన్ఫోర్స్‌ మెంట్‌ వింగ్‌, నార్కోటిక్స్‌ ఇన్వెస్టిగేషన్‌ సూపర్‌ వైజింగ్‌ వింగ్‌ ఏర్పాటు అయ్యాయి. హైదరాబాద్‌ సీపీ కార్యాలయం కేంద్రంగా ఈ రెండు విభాగాలు పనిచేయనున్నాయి. విడతలవారిగా అన్ని కమిషనరేట్స్‌, ఆయా జిల్లా కేంద్రాల్లో నార్కోటిక్‌ డ్రగ్స్‌ కంట్రోల్‌ సెల్స్‌ ఏర్పాటు చేయాలని పోలీసుశాఖ అధికారులు నిర్ణయించారు. డ్రగ్స్‌ నిర్మూలనన కోసం రెండు ప్రత్యేక విభాగాలు ఏర్పాటు చేశామని సీపీ సీవీ ఆనంద్‌ తెలిపారు. హైదరాబాద్‌ పోలీస్‌ కమిషనర్‌ కార్యాలయంలో నార్కోటిక్‌ ఎన్ఫోర్స్‌ మెంట్‌ వింగ్‌ విభాగాలు ఏర్పాటు చేసినట్లు తెలిపారు. హైదరాబాద్‌ నార్కోటిక్స్‌ ఎన్ఫోర్స్‌ మెంట్‌ వింగ్‌, నార్కోటిక్స్‌ ఇన్వెస్టిగేషన్‌ సూపర్‌ వైజింగ్‌ వింగ్‌ ఏర్పాటు చేశామమని సీపీ చెప్పారు. దేశ వ్యాప్తంగా ఈ డ్రగ్స్‌ అనేది సమాజంలో హానికరంగా మారుతోందన్నారు. గత నాలుగు నెలలుగా డ్రగ్స్‌పై సీఎం కేసీఆర్‌ విూటింగ్‌ ఏర్పాటు చేసి స్పష్టమైన ఆదేశాలు ఇచ్చారని అన్నారు. జనవరి 28 న జరిగిన సీఎం సమావేశంలో డ్రగ్స్‌ నిర్ములనకు గట్టి చర్యలను చేపట్టాలని ఆదేశించారన్నారు. డ్రగ్స్‌ కింగ్‌ పిన్‌గా టోనీ అరెస్ట్‌ అయిన తరువాత సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయని సీపీ ఆనంద్‌ తెలిపారు. హైదరాబాద్‌ వ్యాపారవేత్తలతో టోనీ కి సంబంధాలు కలిగి ఉండడంతో మొట్ట మొదటి సారిగా డ్రగ్స్‌ కొనుగోలు చేసిన వారిపై కేసులు పెట్టి అరెస్ట్‌ చేసి, జైలుకి పంపించామన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా వెయ్యిమంది పోలీసులతో నార్కోటిక్‌ ఎన్ఫోర్స్‌ మెంట్‌ వింగ్‌ ఏర్పాటు చేయాలని ఆదేశించారని అన్నారు. హైదరాబాద్‌లో ఏర్పాటు చేసిన నార్కోటిక్‌ ఎన్ఫోర్స్‌ మెంట్‌ వింగ్‌ డీసీపీగా సౌత్‌ జోన్‌ టాస్క్‌ ఫోర్స్‌ డీసీపీ చక్రవర్తిని నియమించినట్లు చెప్పారు. కేవలం ఈ టీమ్స్‌ డ్రగ్స్‌ విూదనే దృష్టి పెట్టి, కేసులు నమోదు చేస్తారన్నారు. హైదరాబాద్‌లో కేవలం 22 శాతం మాత్రమే శిక్షలు పడుతున్నాయని, కేసులు కోర్టులో వీగి పోతున్నాయని చెప్పారు. ఎన్డీపీసీ యాక్ట్‌ కేసులపై పోలీస్‌ సిబ్బందికి అవగహన తెప్పిస్తామన్నారు. ఇక నుండి ఎలాంటి తప్పులు జరగకుండా, నేర దర్యాప్తు కచ్చితంగా చేసి వారికి శిక్షలు పడేలా చూస్తామని తెలిపారు. కేసు నమోదు చేసినప్పటి నుండి కన్విక్షన్‌ పడే వరకు సూపర్‌ విజన్‌ ఉండేలా చూస్తామని సీపీ ఆనంద్‌ స్పష్టం చేశారు.