అరవై ఏండ్ల తెలంగాణ ఆకాంక్షను తీర్చిన సోనియమ్మపై వ్యాఖ్యలు చేసిన ప్రధాని మోడీ గారి దిష్టిబొమ్మను దగ్ధం చేసిన ములుగు ఎమ్మెల్యే దనసరి సీతక్క గారు....
ఈరోజున ములుగు జిల్లా కేంద్రంలోని జాతీయ రహదారిపై ములుగు జిల్లా అధ్యక్షులు నల్లెల్ల కుమారస్వామి గారి ఆధ్వర్యంలో 4కోట్ల ప్రజల తెలంగాణ ఆకాంక్షను నెరవేర్చిన సోనియమ్మను విమర్శించిన ప్రధాని మోడీ గారి దిష్టిబొమ్మ దగ్ధ కార్యక్రమం నిర్వహించగా అట్టి కార్యక్రమానికి ముఖ్య అతిధిగా ఏఐసీసీ జాతీయ మహిళ ప్రధాన కార్యదర్శి మరియు ములుగు నియోజకవర్గ ఎమ్మెల్యే దనసరి సీతక్క గారు విచ్చేసి జాతీయ రహదారిపై మోడీ గారి దిష్టిబొమ్మను దహనం చేశారు.


    ఈ కార్యక్రమంలో సీతక్క గారు మాట్లాడుతూ ప్రజల ఆకాంక్ష మేరకు, చిన్న రాష్ట్రాలతోనే దేశం అభివృద్ధి చెందుతుందని, అరవై ఏండ్ల పోరాటాన్ని ఒక్క మాటతో ఇచ్చిన సోనియమ్మను విమర్శించిన మోడీ గారు తెలంగాణ ప్రజలను కించపరచడమే అని అన్నారు. దేశంలో ఫ్యూడల్ వ్యవస్థను పెంచి పోషిస్తూ, యువకులకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలు లేకుండా చేస్తూ, భారత దేశ ఆర్థిక వ్యవస్థను, భవిష్యత్తును నిర్వీర్యం చేస్తూ, దేశాన్ని అంధకారంలోకి నెట్టివేశారు అని అన్నారు. మేము ఇద్దరం మాకు ఇద్దరు అన్నట్లు మోడీ, అమిత్ షాలు అంబాని, ఆదానిలకు దేశాన్ని దోచిపెడుతూ, దేశాన్ని ఆర్ధిక సంక్షోభంలోకి నెట్టివేశాడని అన్నారు. పేదలంటేనే బీజేపీ పార్టీకి నచ్చదని, దేశంలో నగదు బదిలీ, జీ.ఎస్.టి., పెట్రోల్, డీజిల్, వంట గ్యాస్ ధరలు పెంపు, నిత్యావసర సరుకుల ధరల పెంపుతో సామాన్యుడు బ్రతకలేని స్థితికి తీసుకొచ్చారని అన్నారు. రైతు నల్ల చట్టలతో రైతుల ప్రాణాలను పొట్టన బెట్టుకున్నాడని, కార్మికుల చట్టాల సవరణతో పెట్టుబడి దారి వ్యవస్థను పెంచి పోషించి కార్మిక రంగాన్ని కూడా నిర్వీర్యం చేయాలని చూశాడని అన్నారు. మత విద్వేషాలను రెచ్చగొడుతూ దేశంలో హింసను ప్రేరేపిస్తూ భావోద్వేగాలతో ఆటలాడుతున్నారని అన్నారు. పేదల కోసం పని చేసింది కాంగ్రెస్ పార్టీ విద్యా హక్కు చట్టం, పోడు భూముల హక్కు చట్టం, పనికి ఆహార భద్రత చట్టం, భూ సంస్కరణల చట్టం, రాజభరణాల నిషేధం, బ్యాంకుల జాతీయం, అటవీ హక్కుల పత్రాలు, ఇందిరమ్మ ఇండ్లు, ఆరోగ్య శ్రీ, రాజీవ్ గృహ కల్పన, రాజీవ్ యువ కిరణాలు, ఇందిరా జల ప్రభ, ఆనకట్టలు, ఆయాకట్టలు, ప్రాజెక్టులు, ఉచిత విద్యుత్, పంట రుణమాఫీ, పంట రుణాలు, వరదల వల్ల నస్తపోయిన రైతులకు నష్ట పరిహారం అందించి పేదల గుండెల్లో చిరస్థాయిగా నిలిచింది కాంగ్రెస్ పార్టీ అని, అలాంటి పార్టీని కావాలని విమర్శిస్తూ, జవహర్ లాల్ నెహ్రు గారి మీద అక్కసు వెళ్లగక్కుతూ, తెలంగాణ ప్రజలను అవమానించిన మోడీ గారు వెంటనే బహిరంగ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేస్తూ ధర్నా నిర్వహించారు.


     ఈ కార్యక్రమంలో కిసాన్ సెల్ జిల్లా అధ్యక్షులు గొల్లపెల్లి రాజేందర్ గౌడ్, యూత్ కాంగ్రెస్ జిల్లా అధ్యక్షులు బానోత్ రవిచందర్, ఫిషర్ మేన్ జిల్లా అధ్యక్షుడు కంబాల రవి,

బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు బైరెడ్డి భగవాన్ రెడ్డి, ములుగు మండల అధ్యక్షులు ఎండి. చాంద్ పాషా, చెన్నొజు సూర్యనారాయణ,వర్కింగ్ కమిటీ అధ్యక్షులు బండి శ్రీనివాస్,

బ్లాక్ కాంగ్రెస్ ఉపాధ్యక్షులు దొంతర వేణి కుమార్,మాజీ సర్పంచ్ మూసిన పెల్లి కుమార్ గౌడ్,రాజీ రెడ్డి,కాడబోయిన కిషోర్, చిందం చందు, అజ్జు, అజ్మీర శ్రీధర్, కాడబోయిన నరేష్, అంగోత్ వంశీ, గోవర్ధన్, శ్రీనివాస్, రాజేందర్, చింతనిప్పుల భిక్షపతి, గందె శ్రీను, ఎస్సీ సెల్ మండల అధ్యక్షుడు మట్టేవాడ తిరుపతి, మైనారిటీ సెల్ మండల అధ్యక్షుడు  షకీల్, కోవద్దిన్,  ఎన్నందుల తిరుపతి తదితర నాయకులు పాల్గొన్నారు.