వొద్దువొద్దు! అణుబాంబులతో ఆటొద్దు!

నింగిలో రెండు

మేఘాలు ఢీకొంటే
నిప్పు పుడుతుంది
అదిమెరుపై మెరుస్తుంది
ఉరుమై ఉరుముతుంది
ఆకాశం భీకరంగా అరుస్తుంది
అదిపిడుగై నేలపైపడుతుంది
అది కనీవినీ ఎరుగని
కలనైనా ఊహించని
విధ్వంసాన్ని సృష్టిస్తుంది
అది ప్రకృతి ప్రళయం విలయం

కానీ అధికార దాహంతో
ఆధిపత్య పోరులో
ఉగ్రరూపం దాల్చిన
అగ్రరాజ్యాలైన అమెరికా
రష్యా నాటో దేశాల
యుద్ద విమానాలతో
గగనతలం దద్దరిల్లితే
పిచ్చుక మీద ఫిరంగులువిసిరితే
ఉక్రెయిన్ పై ఉక్కుపాదం మోపితె
నేడు మిస్సైల్స్ తో విరుచుకుపడితే
రేపు అది అణుబాంబుల ఆటౌతుంది
అకాల మృత్యువు వేటౌతుంది
రాక్షసత్వానికి రాచబాటౌతుంది
అది ప్రపంచదేశాలకు కన్నీటి పాటౌతుంది
ఆ ముప్పునిప్ఫైభూమండలం బుగ్గౌతుంది
                                                                   
అందుకే...
వొద్దు వొద్దు హిరోషిమా నాగ సాకీల
విధ్వంసాన్ని కలనైనా మరవొద్దు
వొద్దు వొద్దు అణుబాంబులతో ఆటొద్దు
వొద్దువొద్దు యుద్ధం వొద్దు శాంతిచర్చలే ముద్దు

రచన. పోలయ్య కవి కూకట్లపల్లి
అత్తాపూర్ హైదరాబాద్...9110784502