మేడారం భక్తులకు శుభవార్త. నేటి నుంచి టోల్ గేట్ ఫ్రీ....


ములుగు,ఫిబ్రవరి10(జనం సాక్షి):-

ములుగు జిల్లా తాడ్వాయి మండలంలోని మేడారంలో ఏర్పాటు చేసిన పార్కింగ్ ప్లేసులకు ఆల్ఫాబెటికల్ నంబర్స్ కేటాయించినట్లు గురువారం సిపి తరుణ్ జోషి తెలిపారు.ఆర్టీసి వాహనాలు గద్దెల దగ్గరగా వెళ్లే అవకాశం ఉంటుందని, పార్కింగ్ ప్లేస్ ఎ నుంచి జి గద్దెలకు సమీపంలోనే ఉంటాయన్నారు. ఇప్పటికే ఇసుక లారీలు ఆపేశామని, వాటిని ములుగు జిల్లా మంగపేట రూట్ కు డైవర్ట్ చేశామన్నారు. నేటి నుండి జవహర్ నగర్ టోల్ గేట్ నుంచి ఎలాంటి టోల్ వసూళ్లు లేకుండా ఫ్రీగా వెళ్లే ఏర్పాట్లు చేశామన్నారు.