చిన్నశేష వాహనంపై ఊరేగిన కళ్యాణ వెంకటేశ్వరుడు


తిరుపతి,ఫిబ్రవరి21 జ‌నంసాక్షి : శ్రీనివాసమంగాపురంలోని జరుగుతున్న శ్రీకల్యాణ వేంకటేశ్వరస్వామివారి బ్రహ్మోత్సవాల్లో రెండో రోజు సోమవారం శ్రీనివాసుడు శ్రీ మురళీకృష్ణుడి అలంకారంలో చిన్నశేష వాహనంపై అభయమిచ్చారు. కొవిడ్‌ `19 నిబంధనల మేరకు వాహనసేవ ఆలయంలో శ్రీ కల్యాణ వేంకటేశ్వరుడు ఒక్కరే ఐదు తలలు గల చిన్నశేష వాహనాన్ని అధిష్టించారు. అనంతరం స్వామి, అమ్మవార్ల ఉత్సవర్లకు వేడుకగా స్నపన తిరుమంజనం నిర్వహించారు. పాలు, పెరుగు, తేనె, కొబ్బరి నీళ్లు, పసుపు, చందనంలతో అభిషేకం చేశారు. రాత్రి హంస వాహనంపై స్వామివారు దర్శనమివ్వనున్నారు.ఈ కార్యక్రమంలో జేఈవో వీరబ్రహ్మం దంపతులు, ఆలయ డిప్యూటీ ఈవో శాంతి, వైఖానస ఆగమ సలహాదారు విష్ణుభట్టాచార్యులు, ఏఈవో గురుమూర్తి, సూపరింటెండెంట్లు పాల్గొన్నారు.