న్యూఢిల్లీ దారుణం

 బాలిక‌కు ప‌నిఇప్పిస్తామ‌ని  పిలిపించి  లైంగిక దాడి,  హ‌త్య

నిందితుడిని అరెస్ట్

న్యూఢిల్లీ : దేశ రాజ‌ధానిలో దారుణం జ‌రిగింది. మైన‌ర్ బాలిక (14)పై లైంగిక దాడికి పాల్ప‌డిన నిందితులు ఆమెను ఊపిరిఆడ‌కుండా చేసి ఉసురుతీసిన ఘ‌ట‌న ఢిల్లీలోని న‌రేలా ప్రాంతంలో జ‌రిగింది. ఫిబ్ర‌వ‌రి 14న ఈ ఘ‌ట‌న వెలుగుచూసింది. మృతురాలి కుటుంబ స‌భ్యులు ఫిబ్ర‌వ‌రి 15న పోలీసుల‌కు ఫిర్యాదు చేయ‌డంతో ఢిల్లీ పోలీస్ టీం ఓ నిందితుడిని అరెస్ట్ చేసింది.

తాను ఝాన్సీ నుంచి తిరిగి రాగానే త‌మ షాపు నుంచి దుర్వాస‌న వ‌స్తోంద‌ని ప‌సిగ‌ట్టిన ఢిల్లీలోని న‌రేలా ప్రాంతానికి చెందిన వ్యాపారి పోలీసుల‌కు ఫిర్యాదు చేయ‌డంతో బాలిక మృత‌దేహాన్నిఆయ‌న షాపు నుంచి పోలీసులు క‌నుగొన్నారు. కనిపించ‌కుండా పోయిన షాపు వ‌ర్క‌ర్ కోసం గాలింపు చ‌ర్య‌లు చేప‌ట్టారు.

నిందితుల‌ను ప‌ట్టుకునేందుకు తాము ప్ర‌త్యేక బృందాల‌ను ఏర్పాటు చేశామ‌ని, ఓ నిందితుడు ముంబై పారిపోయేందుకు ప్రయ‌త్నించ‌గా ప‌ట్టుకున్నామ‌ని ఔట‌ర్ నార్త్ డీసీపీ బ్రిజేంద్ర యాద‌వ్ తెలిపారు. బాలిక‌కు ప‌నిఇప్పిస్తామ‌ని పిలిపించిన నిందితులు లైంగిక దాడికి పాల్ప‌డ్డార‌ని, ఆపై ఆమె ప్యాంట్స్‌తోనే మెడ‌కు ఉరిబిగించి ఊపిరిఆడ‌కుండా చేసి హ‌త్య చేశార‌ని చెప్పారు. బాధితురాలు స్పృహ కోల్పోగానే ఆమె మృత‌దేహాన్ని గోనెసంచిలో వేసి ప‌డ‌వేశార‌ని తెలిపారు.