హైదరాబాద్,ఫిబ్రవరి10(జనంసాక్షి): హిజాబ్ వివాదంపై టీఆర్‌ఎస్ ఎమ్మెల్సీ కవిత స్పందించారు. మహిళల వస్త్రధారణ విషయంలో ఆమె కీలక వ్యాఖ్యలు చేశారు. స్త్రీలు సృష్టికర్తలు .. వారికి సొంతంగా నిర్ణయాలు తీసుకునే శక్తి ఉందన్నారు. ఈ సందర్బంగా తాను చేతితో రాసిన కవితను ఆమె ట్విట్టర్‌లో పోస్ట్ చేశారు.నుదుటున సింధూరం పెట్టుకోవడం వ్యక్తిగత స్వేచ్ఛ అయినప్పుడు.. హిజాబ్ ధరించడం ముస్కాన్ వ్యక్తిగత స్వేచ్చ అవుతుందన్నారు. ఎలా ఉండాలి ? ఏం ధరించాలి? ఏం చేయాలి? అన్న విషయాలను మహిళల ఇష్టాఇష్టాలకే వదిలేయాలని కవిత సూచించారు.
హిజాబ్ మహిళల ఇష్టాఇష్టాల వ్యవహారం: కవిత