ఎంపీ అర్వింద్ పై దాడి ఘటనపై విచారణ


15 రోజుల్లో నివేదిక ఇవ్వాలని కేంద్ర హోంశాఖకు ప్రివిలేజ్‌ కమిటీ ఆదేశాలు జారీ 

దిల్లీ: భాజపా ఎంపీ అర్వింద్‌ ఫిర్యాదుపై పార్లమెంట్‌ ప్రివిలేజ్‌ కమిటీ స్పందించింది. ఎంపీ అర్వింద్ పై దాడి ఘటనపై విచారణ జరపాలని ప్రివిలేజ్ కమిటీ ఆదేశించింది. 15 రోజుల్లో నివేదిక ఇవ్వాలని కేంద్ర హోంశాఖకు ప్రివిలేజ్‌ కమిటీ ఆదేశాలు జారీ చేసింది. అర్వింద్‌ అభ్యంతరాలను పరిగణనలోకి తీసుకోవాలని పేర్కొంది.

 ప్రివిలేజ్‌ కమిటీ ఆదేశాలతో కేంద్ర హోంశాఖ రంగంలోకి దిగింది. తెలంగాణ సీఎస్, హోంశాఖ ముఖ్య కార్యదర్శి, డీజీపీ, నిజామాబాద్‌ కలెక్టర్‌, సీపీ, ఆర్మూర్ పోలీసులకు కేంద్ర హోంశాఖ నోటీసులు జారీ చేసింది. పదిహేను రోజుల్లో విచారణ జరిపి సమగ్ర నివేదిక ఇవ్వాలని కేంద్ర హోంశాఖ ఆదేశించింది. గత నెల 25న నిజామాబాద్‌ జిల్లాలో ఎంపీ అర్వింద్ వాహనంపై దాడి జరిగిన విషయం తెలిసిందే. గత 30న ప్రివిలేజ్‌ కమిటీకి అర్వింద్‌ ఫిర్యాదు చేశారు.