మిషన్‌ భగీరత పైపుకు లీక్‌

మంచిర్యాల,ఫిబ్రవరి28  ( జనం సాక్షి):   మంచిర్యాల జిల్లా హజీపూర్‌ మండలం ముల్కల గ్రామ శివారులో భగీరథ పైపు లైన్‌ లీక్‌ అయింది. దాంతో నీరంతా వృథాగా పోతోంది. రోడ్డుపై నీరు ప్రవహిస్తుండటంతో రాకపోకలకు తీవ్ర అంతరాయం కలుగుతోంది. ముల్కల పంప్‌ హౌస్‌ నుండి మంచిర్యాల మున్సిపాలిటీకి వెళ్లే పైపు లైన్‌ కావడంతో మంచినీటి సరఫరా నిలిచిపోయింది. ముల్కల గోదావరి ఘాట్‌ వద్దకు వచ్చే రోడ్డుపై నీరు వెళ్తుండటంతో రేపు మహా శివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకొని పుణ్య స్నానాలు ఆచరించే భక్తులు ఇబ్బందులు పడుతున్నారు.