గూడెం కొత్తవీధి. ఫిబ్రవరి 10. జనం సాక్షి. మండలంలోని ముఖ్యనాయకులతో బీజేపీ సమావేశం ఏర్పాటు చేసి. ఈనెల 20తేదీన,జరగవలసిన, మండల బాడీ మీటింగ్ మరియు బూత్ కమిటీల నియామకం, అలాగే మోర్చాల పూర్తినియామకం మండలబాడీ ల పూర్తి నియామకం జరిగిందని బీజేపీ నాయకులు తెలిపారు. ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ బిజెపి పార్టీ గ్రామ స్థాయి నుండి బలోపేతానికి నాయకులు కష్టపడాలని వచ్చే ఏ ఎన్నికల్లో నైనా పార్టీ గెలుపునకు కృషి చేయాలని పిలుపునిచ్చారు. అలాగే ఈ నెల 20 న జరగబోవు బిజేపి మండల సమావేశానికి ముఖ్య నాయకులు , వివిధ మోర్చాల అధ్యక్షులు, ప్రధాన కార్యదర్శిలు కార్యకర్తల అందరూ తప్పనిసరిగా గూడెం కొత్తవీధి మండలం డేరాల గ్రామంనందు.హాజరుకావాలని కోరారు. ఈ సమావేశంలో బీజేపీ మండల అధ్యక్షులు బొండ్ల .చిరంజీవి.జిల్లా యువమోర్చా ప్రధాన కార్యదర్శి కకురు శేఖర్ .జిల్లా నాయకులు జి.త్రీనాద్, వనపల జోగిరాజు,లకే రాము.మొట్టడం లక్ష్మణ రావు.చల్లంగి అచ్యుత్ పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.
బీజేపీ ఆధ్వర్యంలో మండల స్థాయి సమావేశం..