ఇక్రిశాట్‌ పరిశోధనలు అభినందనీయం


వాతావరణ సవాళ్లకు అనుగుణంగా వంగడాల సృష్టి

వ్యవసాయానికి డిజిటలైజేషన్‌ జోడిరచాలి

సన్నాకరు రైతులను ఆదుకునే విధంగా వంగడాలు

ఇక్రిశాట్‌ పరిశోధనలు ప్రపంచానికి కొత్తదారి చూపాలి

డిజిటల్‌ అగ్రికల్చర్‌ పెంచాలనే లక్ష్యంతో ఉన్న ప్రభుత్వం

ప్రజలకు ఆహారభద్రతతో పాటు బలవర్థక ఆహారం మా సంకల్పం

బడ్జెట్‌లోనూ వ్వయసాయానికి ప్రాధాన్యం పెంచాం

ఇక్రిశాట్‌ స్వర్ణోత్సవాల వేడుకల్లో మోదీ వెల్లడిస్వర్ణోత్సవ లోగో ఆవిష్కరించిన ప్రధాని మోడీ

హైదరాబాద్‌,ఫిబ్రవరి5 ( జనంసాక్షి ) : వాతావరణ మార్పులు సవాల్‌గా మారిన ప్రస్తుత తరుణంలో అందుకు తగ్గట్లుగా ఇక్రిశాట్‌ పరిశోధనలు ప్రపంచానికి కొత్తదారి చూపించాలని.. ప్రధాని నరేంద్రమోడీ సూచించారు. పంటకాలం తక్కువగా ఉండే వంగడాల సృష్టి మరింత జరగాలన్నారు. వాతావరణ మార్పులు తట్టుకునే వంగడాలు సృష్టించాలని ప్రధాని నరేంద్ర మోదీ పేర్కొన్నారు. ఇక్రిశాట్‌ స్వర్ణోత్సవాల వేడుకల్లో మోదీ పాల్గొని ప్రసంగించారు. ఇక్రిశాట్‌ స్వర్ణోత్సవాలకు హాజరైన వివిధ దేశాల ప్రతినిధులకు ప్రధాని మోదీ అభినందనలు తెలిపారు. వసంత పంచమి రోజు స్వర్ణోత్సవాలు జరుపుకోవడం ఆనందంగా ఉందన్నారు.వసంతపంచమి రోజుల ఈ ఉత్సవాలు జరుపుకోవడం అభినందనీయమని అన్నారు. 50 ఏండ్లుగా విూరు చేస్తున్న పరిశోధనలకు అభినందనల అని తెలిపారు. ప్రజలకు ఆహరభద్రతతో పాటు, బలవర్ధక ఆహారాన్ని కూడా ఇవ్వాలన్నదే ప్రభుత్వ  సంకల్పమని అన్నారు. దేశంలోని రైతులను ఆదుకుంటూ ఈ లక్ష్యం దిశగా అడుగులు వేస్తున్నామని అన్నారు. ఈ క్రమంలో  వచ్చే 50 ఏండ్లు మరిన్ని పరిశోధనలు జరగాలి. ఐదు దశాబ్దాల కాలంలో భారత్‌ ఆహార సమృద్ధి సాధించింది. తక్కువ నీటి వినియోగంతో ఎక్కువ ఉత్పాదకత సాధించాలి. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌ రాష్టాల్ల్రో పంటల దిగుబడి గణనీయంగా ఉంది. ఇక్రిశాట్‌ పరిశోధనలు ప్రపంచానికి కొత్తదారి చూపించాలి. పంటకాలం తక్కువగా ఉండే వంగడాల సృష్టి మరింత జరగాలి. వాతావరణ మార్పులు తట్టుకునే వంగడాలు సృష్టించాలి. తెలుగు రాష్టాల్ల్రో సాగు విస్తీర్ణం పెరిగేందుకు ఇక్రిశాట్‌ పరిశోధనలు దోహదపడుతాయన్నారు. భారత్‌లో 80 శాతం మంది చిన్న కమతాల రైతులు ఉన్నారని, వారంతా సంక్షోభం ఎదుర్కొంటున్నారు. చిన్న రైతుల సాగు వ్యయం తగ్గించాల్సిన అవసరం ఉందన్నారు. పంటల దిగుబడిపై వాతావరణ మార్పులు తీవ్ర ప్రభావం చూపిస్తాయి. దేశ వ్యవసాయ రంగ బలోపేతానికి శాస్త్రవేత్తలు మరింత కృషి చేయాలన్నారు.. భారత్‌లో 6 రుతువులు, 15 రకాల వాతావరణ పరిస్థితులు ఉన్నాయి. భారత్‌లో 50 వరకు ఆగ్రో క్లైమేట్‌ జోన్లు ఉన్నాయి. దేశంలోని 170 జిల్లాల్లో కరువు పరిస్థితులు ఉన్నాయి. ఈ బడ్జెట్‌ సేంద్రీయ వ్యవసాయానికి ప్రాధాన్యత ఇచ్చాం. వ్యవసాయంలో సాంకేతిక పరిజ్ఞానం పెంచుతున్నాం. డిజిటల్‌ అగ్రికల్చర్‌ పెంచాలనే లక్ష్యంతో ఉన్నాం. సాగులో డ్రోన్ల వినియోగం పెంచేందుకు నిధులు కేటాయించాం. సాగు భూముల వివరాలను డిజిటలైజ్‌ చేశాం అని మోదీ పేర్కొన్నారు. పటాన్‌చెరులోని ఇక్రిశాట్‌ను ప్రధాని నరేంద్ర మోదీ శనివారం మధ్యాహ్నం సందర్శించారు. ఇక్రిశాట్‌ స్వర్ణోత్సవాలకు హాజరైన ప్రధాని మోదీని ఇక్రిశాట్‌ డైరెక్టర్‌ జనరల్‌ జాక్వెలిన్‌ హ్యుస్‌ సన్మానించి, జ్ఞాపికను అందజేశారు. ప్రధాని మోదీ ఇక్రిశాట్‌ 50 వసంతాల లోగోతో పాటు పోస్టల్‌ స్టాంప్‌ను ఆవిష్కరించారు. అంతకుముందు ఇక్రిశాట్‌లో సాగు సంబంధిత ఎగ్జిబిషన్‌ను మోదీ తిలకించారు. మెట్ట పంటల పరిశోధనలను మోదీకి శాస్త్రవేత్తలు వివరించారు. మోదీ ఆసక్తిగా విన్నారు. స్వర్ణోత్సవాల్లో గవర్నర్‌ తమిళిసై సౌందర్‌ రాజన్‌, కేంద్ర మంత్రులు నరేంద్ర సింగ్‌ తోమర్‌, కిషన్‌ రెడ్డితో పాటు పలువురు ప్రముఖులు పాల్గొన్నారు. ఈ సందర్బంగా వ్యవసాయ శాస్త్రవేత్తలను ఉద్దేశించి మోదీ ప్రసంగించారు. స్సర్ణోత్సవ శుభాకాంక్షలను తెలిపారు. ఆజాదీ కీ అమృతోత్సవ్‌ వేళ ఇక్రిశాట్‌ స్సర్ణోత్సవాలను జరుపుకుంటుందన్నారు.  సంస్థ ప్రారంభం నుంచి ఇప్పటివరకు పనిచేసిన వారందరికీ ఆయన అభినందనలు తెలిపారు. మెట్ట ప్రాంత రైతులకు ఇక్రిశాట్‌ పరిశోధనలు ఎంతగానో ఉపయోగపడ్డాయన్నారు. టెక్నాలజీని మార్కెట్‌తో అనుసంధానించి వ్యవసాయాన్ని లాభదాయకంగా మార్చేందుకు ఇక్రిశాట్‌ కృషి చేస్తుందని ఆయన అన్నారు. వాతావరణ మార్పుల కేంద్రం రైతులకు ఎంతో ఉపయోగకరమన్నారు.  వ్యవసాయాన్ని అందరికీ చేరవేయడంలో ఇక్రిశాట్‌ ఎంతో శ్రమించిందని ప్రధాని నరేంద్ర మోడీ అభినందనల వర్షం కురిపించారు. ప్రకృతి సాగుకు, డిజిటల్‌ విధానంలో వ్యవసాయ విధానాలకు తమ ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తోందని ప్రధాని మోదీ తెలిపారు. సాగులో ఆధునికత తీసుకువచ్చేందుకు రైతులకు అవసరమైన సహకారాన్ని అందిస్తున్నామన్నారు. రైతులకు అన్ని రకాలుగా అండగా ఉంటామని ప్రధాని చెప్పారు. పంట దిగుబడిని కాపాడేందుకు అవసరమైన చర్యలు తీసుకుంటున్నామని.. నిల్వ వసతులు పెంచుతామని అన్నారు. దేశంలో 80 శాతం మంది సన్నకారు రైతులే ఉన్నారని.. అందరికీ కేంద్రం అండగా ఉంటుందని భరోసా కల్పించారు. దేశంలో నదుల అనుసంధానాన్ని సీరియస్‌ గా తీసుకున్నట్టు ప్రధాని మోడీ చెప్పారు. రైతులకు ఉపయోగకరంగా.. నీటి వనరులను అభివృద్ధి చేయనున్నామన్నారు. దేశంలో వాతావరణంలో కలుగుతున్న మార్పులు.. చిన్న రైతులకు ఇబ్బందులు కలిగిస్తున్నాయని ప్రధాని మోడీ చెప్పారు. ఈ సమస్యను అధిగమించేందుకు చర్యలు తీసుకుంటు న్నామని అన్నారు. వాతావరణ మార్పులపై ఇతర దేశాలు కూడా తగిన విధంగా స్పందించాలని కోరిన విషయాన్ని ప్రధాని మోడీ.. ఇక్రిశాట్‌ వేదికపై గుర్తు చేశారు. డిజిటల్‌ వ్యవసాయం అన్నది భారత భవిష్యత్తుగా ప్రధాని మోడీ చెప్పారు. నైపుణ్యం ఉన్న యువత.. ఈ దిశగా అడుగులు వేయాలన్నారు. భారతదేశ వ్యవసాయ రంగాన్ని బలోపేతం చేయడానికి ఇక్రిశాట్‌ కృషీ అనిర్వచనీయమని ప్రధాని నరేంద్ర మోడీ అన్నారు. ఈ సందర్భంగా ప్రధాని మోడీ మాట్లాడుతూ, వ్యవసాయాన్ని సులభతరం చేయడానికి ఇతర దేశాలకు సహాయం చేయడంలో ఇక్రిశాట్‌కు 5 దశాబ్దాల అనుభవం ఉందన్నారు. 2070 నాటికి వ్యవసాయ రంగంలో భారత్‌ నికర`సున్నా లక్ష్యాన్ని నిర్దేశిరచిందని ఆయన చెప్పారు. పర్యావరణం కోసం జీవనశైలి అవసరాన్ని కూడా హైలైట్‌ చేసామన్నారు. ప్రో ప్లానెట్‌ పీపుల్‌ మూవ్‌మెంట్‌కు కూడా పిలుపునిచ్చామన్నారు. ఇక్రిశాట్‌ స్వర్ణోత్సవ కార్యక్రమాల్లో భాగంగా ఏర్పాటు చేసిన ప్రత్యేక ఎగ్జిబిషన్‌ను ప్రధాని మోడీ సందర్శించారు. శాస్త్రవేత్తలను కొత్త అవిష్కరణల గురించి అడిగి తెలుసుకున్నారు. ప్రదర్శనలో ఏర్పాటు చేసిన చిరుధాన్యాలు సజ్జ, కంది, శెనగ, వేరుశెనగ తదితర ధాన్యాల సాగు గురించి ప్రధాని ఆరా తీశారు. అనంతరం ప్రధాని మోడీని ఇక్రిశాట్‌ డైరక్టర్‌ జాక్వెలిన్‌ డి ఆరోస్‌ సన్మానించారు. ఈ సందర్భంగా గత 50 యేళ్లలో ఇక్రిశాట్‌ సాధించిన పురోగతిపై ప్రధాని మోడీకి శాస్త్రవేత్తలు వివరించారు. అంతేకాకుండా కొత్త వంగడాల రూపకల్పనలో సాధిస్తున్న ఫలితాలను, రైతులకు అందిస్తున్న అంశాలను వివరించారు. మెట్ట పంటలపై ఇక్రిశాట్‌ అనేక పరిశోధనలు చేస్తున్నట్లు ఇక్రిశాట్‌ డైరక్టర్‌ జాక్వెలిన్‌ డి ఆరోస్‌ తెలిపారు. మెట్ట పంటలపై వాతావరణ మార్పుల ప్రభావంపై మరింత విశ్లేషణాత్మక పరిశోధనలు జరుగుతున్నట్లు జాక్వెలిన్‌ డి ఆరోస్‌ పేర్కొన్నారు. ఆఫ్రికాలో అభివృద్ధి కోసం వ్యవసాయ రంగంలో పరిశోధనలు చేసే అంతర్జాతీయ సంస్థ అని ఇక్రిశాట్‌ డైరక్టర్‌ జాక్వెలిన్‌ డి ఆరోస్‌ వెల్లడిరచారు. అంతకుముందు ఢల్లీి నుంచి ప్రత్యేక విమానంలో శంషాబాద్‌ విమానాశ్రయానికి చేరుకున్న ఆయనకు గవర్నర్‌ తమిళిసై, తెలంగాణ ప్రభుత్వ ఉన్నాతాధికారులు ఘనస్వాగతం పలికారు. అక్కడి నుంచి వాయుసేన ప్రత్యేక హెలికాప్టర్‌లో సంగారెడ్డి జిల్లా పటాన్‌చెరులోని ఇక్రిశాట్‌కు చేరుకున్నారు. అంతకు ముందు  కేంద్ర వ్యవసాయం శాఖా మంత్రి తోమర్‌ మాట్లాడుతూ .. జై విజ్ఞాన్‌..జై అనుసంధాన్‌ నినాదాలను వాటికి ప్రధాని మోదీ చేర్చారని అన్నారు. ఇక్రిశాట్‌ స్వర్ణోత్సవాలలో ఆయన పాల్గొని మాట్లాడారు. నూతన సంకల్పంతో ఇక్రిశాట్‌ ముందుకు సాగాలన్నారు. కొత్త వంగడాల సృష్టితో మరింత ముందుకు సాగాలన్నారు. మరో 25 ఏళ్లలో వ్యవసాయరంగంలో పెనుమార్పులు వస్తాయన్నారు.