ఉద్యోగాల కల్పన అంటే తమవాళ్లు పోస్టులు కాదు

 

అధికార వైసీపీ పార్టీని ఉద్దేశించి పవన్‌ వ్యాఖ్యలు
సినీ రంగ సమస్యలపై అన్ని వర్గాలతో చర్చించాలన్న నాదెండ్ల
అమరావతి,ఫిబ్రవరి11 (జనం సాక్షి):-  రాష్ట్రంలో ఉద్యోగాలు, ఉపాధి కల్పన అంటే తమవాళ్ళకు సలహాదారు పోస్టులు ఇచ్చుకోవడం, వాటిని పొడిగించడం కాదని.. జనసేన అధినేత పవన్‌ కళ్యాణ్‌ అన్నారు. ఈ విషయాన్ని పాలకులు గుర్తించాలని ఏపీలో అధికార వైసీపీ పార్టీని ఉద్దేశించి పవన్‌ వ్యాఖ్యానించారు. శుక్రవారం జనసేన అధినేత పవన్‌ కళ్యాణ్‌.. విూడియాతో మాట్లాడుతూ.. ఏపీలో నిరుద్యోగం, ఉద్యోగ
సమస్యల పరిష్కారానికి వైసీపీ ప్రభుత్వానికి కార్యాచరణ ఉందా అని ప్రశ్నించారు. అధికారంలోకి వచ్చాక న్యూ ఇయర్‌ గ్రీటింగ్స్‌ తోపాటు జాబ్‌ క్యాలెండర్‌ ఇచ్చేస్తా? ఏటా 6 వేల పోలీసు ఉద్యోగాలు, పాతిక వేల టీచర్‌ పోస్టులు ఇస్తాను అంటూ ముద్దులుపెట్టి మరీ చెప్పారని..ఇంతవరకు మెగా డి.ఎస్సీ లేదు, పోలీసు ఉద్యోగాల భర్తీ లేదు.. గ్రూప్‌ 1, గ్రూప్‌ 2 ఉద్యోగాల నోటిఫికేషన్లు రావడం లేదని పవన్‌ కళ్యాణ్‌ దుయ్యబట్టారు. వైసీపీ పరిపాలనలోకి వచ్చిన రెండేళ్ల తరవాత 10 వేల ఉద్యోగాలతో క్యాలెండర్‌ వేశారని అవి ఇప్పటికీ భర్తీ కాలేదని అధికార పార్టీపై పవన్‌ వ్యంగ్యాస్త్రాలు సంధించారు. ఆంధప్రదేశ్‌ రాష్ట్రంలో సీఎం జగన్‌ చర్యలతో యువత నిరాశనిస్పృహలలో కూరుకుపోయారని, నిరుద్యోగులు ఆందోళన చెందుతున్నారని పవన్‌ కళ్యాణ్‌ ఆవేదన వ్యక్తం చేశారు. అధికారంలోకి వచ్చేందుకు పిచ్చిపిచ్చి హావిూలు ఇచ్చిన జగన్‌.. ఇప్పుడు వాటిని నెరవేర్చడం మరచిపోయారని ఎద్దేవా చేసారు. ఉద్యోగాల కోసం యువత కలెక్టరేట్లకు వెళితే వారిపై లాఠీ ఛార్జీ చేయించి అరెస్టులు చేస్తున్నారని పవన్‌ మండిపడ్డారు. రాష్ట్రంలో 30 లక్షల మంది నిరుద్యోగులు ఉన్నారన్నా పవన్‌.. వాళ్ళకు ఉద్యోగాలు కల్పించేందుకు అవసరమైన యాక్షన్‌ ఎª`లాన్‌ వైసీపీ ప్రభుత్వం దగ్గర ఉందా అని ప్రశ్నించారు. యువతకు మేలు చేసే విధంగా ఉద్యోగాల నోటిఫికేషన్లు విడుదల కోసం ముఖ్యమంత్రి జగన్‌ ఇంతవరకు ఎన్ని సవిూక్ష సమావేశాలు నిర్వహించారు? వాటిలో నిర్ణయాలు ఏమిటి? అమలు ఎంత వరకూ వచ్చిందని? పవన్‌ ప్రశ్నించారు. మెగా డి.ఎస్సీ ప్రకటన ఎప్పుడు చేస్తారు, ఆరు వేల పోలీసు ఉద్యోగాల భర్తీ ఎప్పుడు జరుగుతుందో సీఎం జగన్‌ స్వయంగా నిరుద్యోగ యువతకు సమాధానం చెప్పాలని పవన్‌ కళ్యాణ్‌ డిమాండ్‌ చేశారు. బిఈడీ చేసి టీచర్‌ ఉద్యోగాల కోసం ఏళ్ల తరబడి ఎదురుచూస్తున్న వాళ్ళు, వివిధ ఉద్యోగాలకు సన్నద్ధం అవుతున్న వాళ్లు.. నోటిఫికేషన్లు లేకపోవడంతో వయో పరిమితి దాటిపోతోందనే ఆందోళనలో ఉన్నారని వారి ఆందోళన ఈ ప్రభుత్వానికి అర్థమవుతోందా అని ప్రశ్నించిన పవన్‌.. ఒకవేళ అర్థమైనా అర్థం కానట్లు ఉందా అనే
సందేహం కలుగుతోందని వైసీపీ ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. ఇదిలావుంటే సినీ రంగ సమస్యలను పరిష్కరించేందుకు ప్రభుత్వం అన్ని వర్గాల వారిని చర్చలకు పిలువాలని జనసేన నాయకుడు నాదెండ్ల మనోహర్‌ అన్నారు. నిన్న సీఎం జగన్‌ చిత్రసీమ పరిష్కారానికి చూపిన మార్గం సక్రమంగా లేదని ఆరోపించారు. సినీ రంగంలోని అందరి అభిప్రాయాలను పరిగణనలోకి తీసుకోని సమస్యలను పరిష్కరించా లని సూచించారు. సినీ పరిశ్రమ మాదిరిగానే ఇతర అంశాలపైనా సీఎం దృష్టిని సారించాలన్నారు. 787 రోజులుగా ఆందోళన చేస్తున్న రాజధాని రైతులతో ఎందుకు చర్చలు జరపడం లేదని ప్రశ్నించారు. సినీ హీరోలను పిలిచి మాట్లాడినట్లే రైతులను ఆహ్వానించవచ్చు కదా అని వెల్లడిరచారు. ఇసుక, యూరియా కొరతపై సీఎం ఏ చర్యలు తీసుకుంటున్నారని నిలదీశారు. సమస్యను సృష్టించేది రాష్ట్ర ప్రభుత్వమేనని నాదెండ్ల మనోహర్‌ పేర్కొన్నారు. నేడు ఆయన విూడియాతో మాట్లాడుతూ.. రెండు నెలలుగా ఉద్యోగులను హింసించి ఇబ్బందులు పెట్టారన్నారు. రైతు భరోసా కేంద్రాలు పెద్ద స్కాం అని విమర్శించారు. రైతులు రోª`డడెక్కి పరిస్థితిని తీసుకు వచ్చారని నాదెండ్ల మనోహర్‌ పేర్కొన్నారు.