అటల్‌ ఇన్నోవేషన్‌ కింద తొర్రూరు ఎంపిక

యువశాస్త్రవేత్తల తయారీకి ఎంతో ఉపయోగం

ఛాంబర్‌ ఆఫ్‌ కామర్స్‌ ప్రమాణంలో పాల్గొన్న ఎర్రబెల్లి
మహబూబాబాద్‌, ఫిబ్రవరి 23  (జనం సాక్షి): విద్యార్ధులకు వారికి నైపుణ్యం ఉన్న అంశాలపై శిక్షణ ఇవ్వడం ద్వారా వారిలోని సృజనాత్మక శక్తిని వెలికి తీయాలని రాష్ట్ర పంచాయతీరాజ్‌, గ్రావిూణాభివృద్ధి శాఖల మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌ రావు అన్నారు. అటల్‌ ఇన్నోవేషన్‌ మిషన్‌ పథకంలో భాగంగా ఎంపికైన
తొర్రూరు ప్రభుత్వ పాఠశాలలో అటల్‌ టింకరింగ్‌ ల్యాబ్‌ ని మంత్రి ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి ఎర్రబెల్లి మాట్లాడుతూ, నీతి ఆయోగ్‌ కింద దేశంలో అటల్‌ ఇన్నోవేషన్‌ మిషన్‌ ని నెలకొల్పింది. యువ శాస్త్రవేత్తలను తయారు చేయడానికి ఈ మిషన్‌ ద్వారా దేశంలో 9వేల 500 అటల్‌ టింకరింగ్‌ ల్యాబ్‌ లను నెలకొల్పారు. ఒక్కో ల్యాబ్‌ విలువ 20 లక్షలుంటుందన్నారు. మహబూబాబాద్‌ జిల్లాలో మొత్తం ఐదు పాఠశాలలు ఈ పథకం ఎంపికయ్యాయని చెప్పారు. మూడు ప్రభుత్వ పాఠశాలలు రెండు ప్రైవేట్‌ పాఠశాలలు ఈ జాబితాలో ఉండగా తొర్రూరు ప్రభుత్వ పాఠశాల కూడా అటల్‌ ఇన్నోవేషన్‌ మిషన్‌ కు ఎంపిక అవడం ఇక్కడి విద్యార్థుల అదృష్టం అన్నారు. జిల్లాలో ఈ పథకం మూడు ప్రభుత్వ పాఠశాలలు, రెండు ప్రైవేట్‌ పాఠశాలలు ఈ జాబితాలో ఉన్నాయన్నారు. కాగా తొర్రూరు ప్రభుత్వ పాఠశాల కూడా అటల్‌ ఇన్నోవేషన్‌ మిషన్‌కు ఎంపిక కావడం ఇక్కడి విద్యార్థుల అదృష్టం అన్నారు. అటల్‌ ఇన్నోవేషన్‌ మిషన్‌ పథకం ద్వారా మన ప్రాంతానికి చెందిన విద్యార్థులు భావితరాలకు ఆదర్శంగా శాస్త్రవేత్తలుగా తయారై ఈ ప్రపంచాన్ని మరింత సమర్థవంతంగా సానుకూలంగా అందరికీ అందుబాటులో ఉండే విధంగా తీర్చిదిద్దాలని ఆకాంక్షించారు. ఇదిలావుంటే వరంగల్‌, మహబూబాబాద్‌, సూర్యాపేటల మధ్య తొర్రూరు మంచి వ్యాపార కేంద్రంగా ఎదిగిందని పంచాయతీరాజ్‌ శాఖ మంత్రి దయాకర్‌రావు అన్నారు. తొర్రూరు ఛాంబర్‌ ఆఫ్‌ కామర్స్‌ నూతన కార్యవర్గ ప్రమాణ స్వీకార ఉత్సవాన్ని జ్యోతి వెలిగించి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..2006 లో తొర్రూరు ఛాంబర్‌ ఆఫ్‌ కామర్స్‌ ఏర్పడిరది. అంతకు 30 ఏండ్ల ముందే వర్తక సంఘంగా, తర్వాత మర్చంట్స్‌ వెల్ఫేర్‌ అసోసియేషన్‌ ఆఫ్‌ తొర్రూరు ఏర్పడిరద న్నారు. సభ్యుల సంఖ్యను పెంచుకుంటూ ఇవ్వాళ 380 మంది సభ్యులతో విస్తరించిందన్నారు. తొర్రూరు ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేస్తానని మంత్రి తెలిపారు. కార్యక్రమంలో ఆర్యవైశ్య మహా సభ రాష్ట్ర అధ్యక్షులు, బిబతితిటఞ చైర్మన్‌ అమరవాది లక్ష్మీ నారాయణ, తొర్రూరు ఛాంబర్‌ ఆఫ్‌ కామర్స్‌ అధ్యక్షుడు మచ్చ సురేష్‌, ప్రధాన కార్యదర్శి బొనగిరి శంకర్‌, కోశాధికారి చిడురాల శ్రీనివాస్‌, కార్యవర్గ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.