అక్రమ మొరం రవాణా: అడ్డుకున్న గ్రామస్థులు

 


కోటగిరి ఫిబ్రవరి 26 జనం సాక్షి:- కోటగిరి మండలంలోని ఎత్తోండ గ్రామంలో కొన్ని రోజులుగా మోరం మాఫియా గ్యాంగ్ రేయింపగలు అని తేడా లేకుండా,ప్రభుత్వ అనుమతులు బేఖతరు చేస్తూ విచ్చల విడిగా అక్రమ మొరం రవాణా చేస్తున్న తీరును చూసి కొందరు గ్రామస్థులు మొరం రావాణా దారులను అడ్డుకున్నారు.ఈ సందర్భంగా గ్రామస్థులు మాట్లాడుతూ...గ్రామంలోని పలు అభివృద్ధి పనులకు సాకుగా చూపి గ్రామ శివారులోని గుట్టలకు గుట్టలే తోడేసి అక్రమ సంపాదనే ధ్యేయంగా మొరం మాఫియా రావాణా దారులు తీరు హేయమైన చర్యగా అభివర్ణించారు.కొన్ని రోజులుగా ఇంత జరుగుతున్న సంభందిత అధికారులు పట్టించుకోక పోవడంతో పలు రకాల అనుమానాలు వ్యక్తం అవుతున్నాయని ఈ సందర్భంగా వారు పేర్కొన్నారు.ఈ కార్యక్రమం లో అరుణ్ కుమార్,శంకర్,తారసింగ్, శంకర్ గౌడ్,వెంకటేశ్వరావు,తదితరులు పాల్గొన్నారు.