నేడు భోళా శంకర్‌ ఫస్ట్‌ లుక్‌ విడుదల

 


 ( జనం సాక్షి):

అగ్ర కథానాయకుడు చిరంజీవి నటిస్తున్న కొత్త సినిమా ’భోళా శంకర్‌’. మెహర్‌ రమేష్‌ దర్శకుడు. తమన్నా నాయికగా నటిస్తున్నది. కీర్తి సురేష్‌ చిరంజీవికి సోదరి పాత్రలో కనిపించనుంది. మహాశివరాత్రి పర్వదినం సందర్భంగా మార్చి 1న ఈ సినిమా ఫస్ట్‌ లుక్‌ను విడుదల చేయబోతున్నారు. గతంలో ’స్వాగ్‌ ఆఫ్‌ భోళా’ పేరుతో రిలీజ్‌ చేసిన ప్రీ లుక్‌ మెగాభిమానులను ఆకట్టుకోగా..ఇప్పుడు ఫస్ట్‌ లుక్‌ కోసం ఆసక్తి నెలకొంది. క్రియేటివ్‌ కమర్షియల్స్‌తో కలిసి అనిల్‌ సుంకర తన ఏకే ఎంటర్‌టైన్‌మెంట్స్‌ సంస్థలో ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. రామబ్రహ్మం సుంకర నిర్మాత. ప్రస్తుతం రెగ్యులర్‌ చిత్రీకరణ జరుపుకుంటున్నదీ సినిమా. రఘుబాబు, రావు రమేష్‌, మురళీశర్మ, రవిశంకర్‌ తదితరులు ఇతర పాత్రల్లో నటిస్తున్న ఈ చిత్రానికి సంగీతం : మహతి స్వరసాగర్‌, సినిమాటోగ్రఫీ : డుడ్లీ, ఎడిటర్‌ : మార్తాండ్‌ కె వెంకటేష్‌.